Eggs Price | భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఒక్క ఎగ్ రూ.10?
Egg Price | అసలే వీకెండ్.. ఆపై కమ్మేసిన మబ్బులు. వాతావరణం చల్లగా ఉండటంతో నాన్ వెజ్‌తో (Nonveg) ఎంజాయ్ చేద్దామనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఇప్పటికే మటన్ రూ.1000కి దగ్గరలో ఉంది. చికెన్ ధర (Chicken) కూడా చుక్కులనంటింది. ఇక కోడిగుడ్డుతో అయినా సరిపెట్టుకుందామంటే దాని ధర (Egg Price) భారీగా పెరుగుతున్నది.
Eggs Price | త్రినేత్ర.న్యూస్: అసలే వీకెండ్.. ఆపై కమ్మేసిన మబ్బులు. వాతావరణం చల్లగా ఉండటంతో నాన్ వెజ్‌తో (Nonveg) ఎంజాయ్ చేద్దామనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఇప్పటికే మటన్ రూ.1000కి దగ్గరలో ఉంది. చికెన్ ధర (Chicken) కూడా చుక్కులనంటింది. ఇక కోడిగుడ్డుతో అయినా సరిపెట్టుకుందామంటే దాని ధర (Eggs Price) భారీగా పెరుగుతున్నది. ఇక కూరగాయల (Vegetables) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మొన్నటి వరకు రూ.250కే దొరికిన కేజీ బాయిలర్ చికెన్ (Broiler Chicken).. ఇప్పుడు రూ.300కు చేరింది. రెండు మూడు వారాల వ్యవధిలోనే రూ.50 పెరిగింది. సామాన్యుడి అందుబాటు ధరల్లో ఉండే ఎగ్ ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.292 వద్ద కొనసాగుతోండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.259కి చేరుకుంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.140 పలుకుతుండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.167గా ఉంది. ఇక కరీంనగర్ జోన్‌లో ఫారం దగ్గర కిలో లైవ్ బర్డ్ రూ.140, రిలైట్ లైవ్ బర్డ్ రూ.167, డ్రస్స్‌డ్ చికెన్ రూ.259, స్కిన్ లెస్ చికెన్ రూ.292గా ఉన్నాయి. దీంతో పెరిగిన ధరల వల్ల చికెన్ ముక్క లోపలికి పోవాలంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. కోళ్ల ఫామ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఒక్క గుడ్డు రూ.10?
చికెన్ ధరలకు కోడి గుడ్డు కూడా తోడయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క గుడ్డు రూ.8కి అమ్ముతున్నారు. ఏప్రిల్‌లో రూ.4గా ఉన్న ఒక్కొ గుడ్డు ధర మే నాటికి రూ.5కి చేరుకుంది. ఇక జూన్ మొదటివారంలో రూ.6గా ఉండగా, ప్రస్తుతం రూ.8కి పెరిగింది. తొందరలోనే ఒక్క ఎగ్ ధర రూ.10కి చేరుకోవచ్చని పాల్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రతతో 10 శాతం కోళ్లు చనిపోయాయని, దీంతో ఉత్పత్తి తగ్గిందని.. వీటికితోడు కోళ్ల మేత, మందుల ధరలు కూడా పెరగడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసినవో ప్రజలకు చెప్పు
- ●Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
- ●MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- ●New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
- ●Heavy Rain | హైదరాబాదీలకు అలర్ట్.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లారో ఇక అంతే!
- ●Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..

Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసినవో ప్రజలకు చెప్పు

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు






