New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
New Bride Death | ఆమెకు నాలుగు నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లయింది. ఎన్నో కొంగొత్త ఆశలతో పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగుపెట్టింది. భర్తతో కలిసి నూరేళ్లు జీవించాలనుకుంది. ఇంతలో విధికి కన్ను కుట్టిందో ఏమో విద్యుత్ రూపంలో ఆమె ప్రాణాలను కబళించింది.
New Bride Death | త్రినేత్ర.న్యూస్: ఆమెకు నాలుగు నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లయింది. ఎన్నో కొంగొత్త ఆశలతో పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగుపెట్టింది. భర్తతో కలిసి నూరేళ్లు జీవించాలనుకుంది. ఇంతలో విధికి కన్ను కుట్టిందో ఏమో విద్యుత్ రూపంలో ఆమె ప్రాణాలను కబళించింది. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామానికి చెందిన నల్ల రేఖ (23)కు నాలుగు నెలల క్రితం మహారాష్ట్రలోని అప్పారావుపేట్‌కు చెందిన యువకుడితో పెళ్లి చేశారు. భర్త సోదరి వివాహం గత గురువారం లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో నిర్వహించారు. రేఖతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆ వివాహానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి వధువును అత్తారింటికి సాగదోలి బోరిగాం గ్రామానికి తిరిగి వచ్చారు.
శుక్రవారం ఉదయం రేఖ ఇంటి దాబాపై బట్టలు ఆరేస్తుండగా చీర సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ షాక్‌కు గురైన రేఖ అక్కడికక్కడే కుప్పకూలింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి దండ్రులు ఆమె మృతదేహాన్ని చూస్తూ బోరున విలపించారు. భార్యను విగతజీవిగా చూసిన భర్త రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
అనంతరం ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలకు వేసిన రక్షణ పైపులు పగిలిపోవడం వల్లే చీర నేరుగా తీగలకు తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Laptop | మ్యాక్‌బుక్ వర్సెస్ థింక్‌ప్యాడ్.. ఏ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి..?
- ●Bhagyaraj | ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం - పెళ్లైన రెండేళ్లకే భార్య మరణం - సినిమా కథలాగే భాగ్యరాజ్ జీవితం
- ●Amrabad Tiger Reserve | తెలంగాణ అడవుల్లో పచ్చని శుభవార్త.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పులులు
- ●NPS | దీర్ఘకాలంలో ఎన్పీఎస్ బెస్ట్.. రికవర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే సరైన సమయమా..?
- ●OpenAI | ఓపెన్ఏఐ కొత్త చిప్ జలపెనో.. చాట్ జీపీటీ సేవలు మరింత వేగవంతం..
- ●Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసినవో ప్రజలకు చెప్పు

Laptop | మ్యాక్‌బుక్ వర్సెస్ థింక్‌ప్యాడ్.. ఏ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి..?

Bhagyaraj | ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం - పెళ్లైన రెండేళ్లకే భార్య మరణం - సినిమా కథలాగే భాగ్యరాజ్ జీవితం

Amrabad Tiger Reserve | తెలంగాణ అడవుల్లో పచ్చని శుభవార్త.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పులులు

NPS | దీర్ఘకాలంలో ఎన్పీఎస్ బెస్ట్.. రికవర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే సరైన సమయమా..?






