Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
Nithin Kamath | ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే మందులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ప్రజలు బరువును తగ్గించుకునేందుకు వెయిట్ లాస్ మెడిసిన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన జీఎల్పీ-1 మందులను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
Nithin Kamath | ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే మందులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ప్రజలు బరువును తగ్గించుకునేందుకు వెయిట్ లాస్ మెడిసిన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన జీఎల్పీ-1 మందులను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే భారత్‌లో ఈ మందులు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నా చాలా మంది ఈ మందులను వాడడం లేదని, ఇది చాలా వింతగా ఉందని జీరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా జీఎల్పీ-1 మందులకు విపరీతమైన ఆదరణ లభిస్తుందని, జనరిక్ వెర్షన్ల కారణంగా భారత్‌లో ఇవి చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని, జిమ్ మెంబర్ షిప్ కన్నా ఇవే చవక అని, అయినప్పటికీ బరువు తగ్గేందుకు చాలా మంది వీటిని వాడడం లేదని ఆయన తెలిపారు.
అమ్మకాల లక్ష్యాలను తగ్గించిన కంపెనీలు..
దేశంలో ఊబకాయం కేసులు పెరుగుతున్నప్పటికీ, జీఎల్పీ-1 ఆధారిత జనరిక్ మందులు గణనీయంగా చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా భారతీయులు వాటిని ఆశించిన స్థాయిలో స్వీకరించడం లేదని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. పేటెంట్ గడువు ముగియడంతో జనరిక్ సెమాగ్లూటైడ్ మందులు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి అమ్మకాలు భారీగా పెరుగుతాయని తాను భావించానని నితిన్ కామత్ చెప్పారు. అయితే ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, జనరిక్ సెమాగ్లూటైడ్ మార్కెట్లోకి భారీ అంచనాలతో ప్రవేశించిన భారతీయ ఔషధ తయారీ సంస్థలు ఇప్పుడు తమ తొలి ఏడాది అమ్మకాల లక్ష్యాలను నిశ్శబ్దంగా తగ్గిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జీఎల్పీ-1 మందుల నెలవారీ ఖర్చు సుమారు రూ.1వేయి నుంచి రూ.2,500 మధ్యే ఉంది. ఈ మొత్తం చాలా జిమ్ సభ్యత్వాల కంటే తక్కువేనని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఔషధ కంపెనీలు తమ అమ్మకాల అంచనాలను 25 నుంచి 30 శాతం వరకు తగ్గించడం, డిమాండ్ ఊహించిన స్థాయిలో లేదనే సంకేతంగా ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ చాలా విచిత్రమైన మార్కెట్..
భారత్ చాలా విచిత్రమైన మార్కెట్ అని, ఊబకాయం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పేటెంట్ గడువు ముగిసిన తర్వాత జనరిక్ జీఎల్పీ-1 మందుల అమ్మకాలు భారీగా పెరుగుతాయని తాను భావించానని అన్నారు. ప్రస్తుతం ఇవి తక్కువ ధరలకు లభిస్తున్నాయని, బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం, మెటబాలిక్ ఆరోగ్యం, కాలేయ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయని ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే తక్కువ ధర ఉన్నప్పటికీ ప్రధాన సమస్య ధర కాదని, చికిత్సను దీర్ఘకాలం కొనసాగించడమే అసలు సవాలని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు. జీఎల్పీ-1 మందులు ఇంజెక్షన్ రూపంలో ఉండటంతో వాటిని వారానికి ఒకసారి నిరంతరం తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ మందులు ఆపేస్తే తగ్గిన బరువు తిరిగి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

అడ్డంకులు ఇవే..
భారత్‌లో జీఎల్పీ-1 మందుల వినియోగం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఎందుకు తక్కువగా ఉందనే అంశంపై కూడా నితిన్ కామత్ కొన్ని కారణాలను ప్రస్తావించారు. భారతీయ వైద్యులు కొత్త తరహా మందులను సూచించే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ చికిత్సను ప్రారంభించే రోగుల సంఖ్య పరిమితమవుతోందని అన్నారు. అలాగే రోగులు స్వయంగా ఇంజెక్షన్ వేసుకోవాల్సి రావడం కూడా మరో ప్రధాన అడ్డంకిగా ఆయన పేర్కొన్నారు. చాలామందికి స్వయంగా ఇంజెక్షన్ తీసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుందని, అదే ప్రారంభ దశలోనే చాలా మందిని వెనక్కి తగ్గేలా చేస్తుందని ఆయన తెలిపారు. అయితే భవిష్యత్తులో జీఎల్పీ-1 ట్యాబ్లెట్లు ఇంకా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తే పరిస్థితి మారే అవకాశాలు ఉంటాయని అన్నారు. వారానికోసారి ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ట్యాబ్లెట్ల రూపంలోని చికిత్సను సులభంగా స్వీకరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్యాబ్లెట్లు వస్తే..
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతుండగా, జీఎల్పీ-1 మందులు కేవలం బరువు తగ్గించడానికే కాకుండా గుండె, మెటబాలిక్ వ్యవస్థ, కాలేయ ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కలిగిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే భారత్‌లో ఈ మందులు విస్తృతంగా ప్రాచుర్యం పొందాలంటే ధర మాత్రమే కాకుండా, వినియోగంలో సౌలభ్యం, దీర్ఘకాలం చికిత్స కొనసాగించే సామర్థ్యం, అలాగే ఊబకాయం చికిత్సపై ప్రజలు, వైద్యుల దృక్పథంలో మార్పులు కూడా కీలక పాత్ర పోషించనున్నాయని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు

USA IPOs | భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక అమెరికా ఐపీవోల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు..
జూన్ 16, 2026

Obesity | ఊబకాయం గురించి చాలా మందికి ఉండే పెద్ద అపోహలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
జూన్ 16, 2026

Nithin Kamath | బ్రోకరేజీ సంస్థలకు జీరోధా నితిన్ కామత్ హెచ్చరిక.. ఎంటీఎఫ్లపై అంత ఎక్స్పోజర్ వద్దు..
మే 20, 2026
తాజావార్తలు
- ●MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- ●New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
- ●Heavy Rain | హైదరాబాదీలకు అలర్ట్.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లారో ఇక అంతే!
- ●Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..
- ●Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు
- ●Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు

Heavy Rain | హైదరాబాదీలకు అలర్ట్.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లారో ఇక అంతే!

Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..



