Heavy Rain | హైదరాబాదీలకు అలర్ట్.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లారో ఇక అంతే!
Heavy Rain | హైదరాబాద్‌లో (Hyderabad) అక్కడక్కడ జల్లులు కురుస్తుండగా, పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే (Heavy Rain) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
Heavy Rain | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) అక్కడక్కడ జల్లులు కురుస్తుండగా, పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే (Heavy Rain) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. సాయంత్రం 6 గంటల తరువాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయంలో భారీ వర్షం (Rain Alert) పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని హైదరాబాద్ నగర ప్రజలకు సూచించింది.
మరో రెండు గంటల్లో మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, వికారంబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
RAIN ALERT - 12.20PM ⚠️🌧️
Scattered INTENSE RAINS across Mahabubabad, Jangaon to further cover Siddipet, Sircilla, Karimnagar, Nizamabad, Kamareddy, Sangareddy, Medak, Jagitial Vikarabad in next 2hrs ⚠️⛈️
More INTENSE RAINS to form across North, Central TG districts in next…
— Telangana Weatherman (@balaji25_t) June 27, 2026
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, సోమవారం నుంచి జులై 2 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.
HyderabadRains UPDATE 1 ⚠️🌧️
Here and there SCATTERED SHOWERS expected in Hyderabad city in next 1hr, this will further convert to MODERATE RAINS during noon - evening hours
Plan accordingly ⚠️🌧️ https://t.co/Jkw2ufBnd3
— Telangana Weatherman (@balaji25_t) June 27, 2026
సంబంధిత వార్తలు

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
జూన్ 27, 2026

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
జూన్ 27, 2026

New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
- ●MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- ●New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
- ●Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..
- ●Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు
- ●Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు

Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..



