Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు
Vegetable Prices | పెరుగుతున్న ధరలు (Price Hike) వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. మొన్నటి దాకా గ్యాస్, పెట్రోల్ ధరలు చుక్కలనంటగా.. తాజాగా కూరగాయలు (Vegetable Prices) కూడా అదే దారిలో పయణిస్తున్నాయి. తానేమీ తక్కువ కాదన్నట్లు కోడి గుడ్ల (Eggs) రేటు కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
Vegetable Prices | త్రినేత్ర.న్యూస్: పెరుగుతున్న ధరలు (Price Hike) వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. మొన్నటి దాకా గ్యాస్, పెట్రోల్ ధరలు చుక్కలనంటగా.. తాజాగా కూరగాయలు (Vegetable Prices) కూడా అదే దారిలో పయణిస్తున్నాయి. తానేమీ తక్కువ కాదన్నట్లు కోడి గుడ్ల (Eggs) రేటు కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కోడిగుడ్లు, కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
రాష్ట్రంలో కూరగాయల (Vegetables)ధరలు ఏకంగా 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగాయి. దీంతో మార్కెట్‌కు వెళ్లిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏది కొందామన్నా ధరలు మండిపోతుండటంతో ఏది కొనాలన్నా ఆలోచిస్తున్నారు. గతంలో రూ.200 పెడితే సంచి నిండా కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు సగం కూడా నిండటం లేదని వాపోతున్నారు. సరే గుడ్డు కూర అన్న వండుకుందామంటే అదికూడా కొండెక్కుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి భారీగా పడిపోయిందని, స్థానికంగా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దళారులు ధరలను పెంచేయడంతో తాము కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఈ కారణంగా వినియోగదారులపై భారం ఎక్కువగా పడుతున్నదని చెబుతున్నారు.

కాగా, మార్కెట్లో కోడి గుడ్ల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు రూ.7.50 నుంచి రూ.8గా ఉంది. ట్రే గుడ్లకు రూ.190 అవుతున్నది. 20 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6 ఉండగా, ప్రస్తుతం అది రూ.8కి చేరింది. హోల్ సేల్ మార్కెట్లో రూ.6 నుంచి 6.50 వరకు అమ్ముతున్నారు. అయితే డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో రేట్లు పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలతో పాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో ధరలు..
- టమాటా కిలో- రూ.70 (కొన్ని ప్రాంతాల్లో రూ.100కు చేరింది)
- కాకరకాయ- రూ.60
- బెండ- రూ.35
- క్యారెట్- రూ.42
- బీన్స్- రూ.75
- గోకరకాయ- రూ.28
- చిక్కుడుకాయ- రూ.45
- బీరకాయ- రూ.35
- చామగడ్డ- రూ.27
- కీర- రూ.40
- క్యాప్సికం- రూ.67
- బీట్ రూట్- రూ.25
తాజావార్తలు
- ●PM Modi Bloomberg Forum | ఎవరి నష్టంతోనో మనం ఎదగడం లేదు.. ప్రపంచంతో పాటే భారత్ ప్రగతి
- ●IAS Vikas Marmat | పబ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదు
- ●Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?
- ●Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు
- ●Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన
- ●Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

PM Modi Bloomberg Forum | ఎవరి నష్టంతోనో మనం ఎదగడం లేదు.. ప్రపంచంతో పాటే భారత్ ప్రగతి

IAS Vikas Marmat | పబ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదు

Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?

Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు





