Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు – కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్
కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్‌ను పక్కనపెట్టడంపై టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపికా పడుకోణ్‌తో సినిమా కోసం రోజువారీ ఖర్చులే లక్షల్లో చేయాల్సివుంటుందని అన్నారు. ఆమె లగ్జరీ కోరికలను భరించలేకే మేకర్స్ కల్కి నుంచి ఆమెను తప్పించారని కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు.
Entertainment | Published On Jul 9, 2026, 1.29 pm IST
Deepika Padukone | ప్రభాస్ కల్కి 2 మూవీ నుంచి దీపికా పడుకోణ్‌ను మేకర్స్ పక్కనపెట్టడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వర్గాల్లో వివాదాస్పదమైంది. దీపికా పడుకోణ్ పెట్టిన ఎనిమిది గంటల రూల్ కండీషన్‌తో పాటు రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటం వల్లనే నిర్మాతలు ఆమెను ఈ సినిమా నుంచి తీసేసినట్లు ప్రచారం జరిగింది. కల్కి నుంచి వైదొలగడానికి గల కారణాలను ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పటివరకు బయటపెట్టలేదు. మరోవైపు కల్కి 2 మేకర్స్ కూడా ఈ వివాదంపై సెలైంట్‌గానే ఉంటున్నారు.
అదనపు ఖర్చులు....
కల్కి 2లో దీపికా పడుకోణ్ రోల్‌ను సాయిపల్లవితో రీప్లేస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లోనూ సాయిపల్లవి జాయిన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కల్కి 2 వివాదంపై ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. రెమ్యూనరేషన్ కాకుండా దీపికా పడుకోణ్ కోసం అదనపు ఖర్చులు చాలానే చేయాల్సివస్తుందని అవన్నీ భరించలేకే మేకర్స్ ఆమెను కల్కి 2 నుంచి తీసేశారని కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు.
లగ్జరీ హోటల్స్...
"దీపికా పడుకోణ్‌తో సినిమా అంటే రోజు వారీ ఖర్చులే చాలా ఉంటాయి. ఒక్కోసారి లక్షల వరకు వెచ్చించాల్సివస్తుంది. షూటింగ్ జరిగినన్నీ రోజులుఆమె వసతి కోసం లగ్జరీ హోటల్స్, విల్లాలు బుక్ చేయాల్సిందే. విమాన ప్రయాణపు ఖర్చులకు అయితే అంతే ఉండదు. పదే పదే జర్నీలు చేస్తూనే ఉంటుంది. రెమ్యూనరేషన్‌తో పాటుగా ఈ అదనపు ఖర్చులను నిర్మాతలే భరించాలి. దీపికా తీరు వల్ల కల్కి నిర్మాతలు చాలానే ఇబ్బందులు పడ్డారు. ఆమె లగ్జరీ కోరికలను భరించలేకే దీపికా పడుకోణ్‌ను కల్కి 2 సినిమా నుంచి పక్కనపెట్టారు" అంటూ కాట్రగడ్డ ప్రసాద్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి. సీనియర్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. బాలీవుడ్ నెటిజన్లు మాత్రం వైరల్ కావడానికి మరొకరిపై అబద్దపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
రాకా...కింగ్
కల్కి 2ను రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా మూవీ చేస్తోంది. ఈ సినిమాలో వారియర్‌గా యాక్షన్ రోల్‌లో కనిపించబోతుంది. రాకా మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. రాకాతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ కింగ్‌లో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026

National Awards | నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప 2, కల్కి – టాలీవుడ్‌కే అత్యధిక పురస్కారాలు
జులై 18, 2026

Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ – వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



