Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
Earthquake | మహారాష్ట్రలోని హింగోలి - నాందేడ్ రీజియన్‌లోని గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
Earthquake | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని హింగోలి - నాందేడ్ రీజియన్‌లోని గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారుల ప్రకారం.. హింగోలి - నాందేడ్ రీజియన్‌లో గురువారం తెల్లవారుజామున 1.40 గంటలకు స్వల్ప భూప్రకంనలు సంభవించాయని తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైందని పేర్కొన్నారు. తదనంతరం వరుసగా మూడు సార్లు భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై 3.6, 3.9, 4.1గా తీవ్ర నమోదైంది. హింగోలి - నాందేడ్ ఏరియాలో భూకంపం కేంద్రీకృతం కాగా, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు.
అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా పలువురు నిద్ర పోకుండా పడిగాపులు కాచారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్
- ●The Odyssey Review | ది ఒడిస్సీ రివ్యూ - కథను కాకుండా ఎలివేషన్లను నమ్ముకున్న క్రిస్టోఫర్ నోలన్ - హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?
- ●El Niño | ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
- ●DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ●Heritage at Every Step 2.0 | మన చరిత్రను బతికిద్దాం: హెరిటేజ్ ఎగ్జిబిషన్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపు
- ●CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..

HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్

The Odyssey Review | ది ఒడిస్సీ రివ్యూ - కథను కాకుండా ఎలివేషన్లను నమ్ముకున్న క్రిస్టోఫర్ నోలన్ - హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?

El Niño | ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్





