త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | 100 శాతం మ‌ద్ద‌తు ధ‌ర‌కు కేంద్ర‌మే కొనాలి: మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం మద్దతు ధరకు కేంద్ర‌మే కొనుగోలు చేయాలని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అన్నారు.

S

Telangana | Published On Oct 1, 2026, 2.48 pm IST

Tummala Nageshwar Rao | 100 శాతం మ‌ద్ద‌తు ధ‌ర‌కు కేంద్ర‌మే కొనాలి: మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూ: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం మద్దతు ధరకు కేంద్ర‌మే కొనుగోలు చేయాలని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అన్నారు. ప్రకటించిన మద్దతు ధరకు 100 శాతం పంటల సేకరణ జరిగినప్పుడే రైతులకు పూర్తి ప్రయోజనం చేకూరుతుంద‌న్నారు. గురువారం సచివాలయంలో ఏపీసీ సెక్రెట‌రీ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ అధికారులతో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో పరిస్థితులు, మద్దతు ధరలపై ఆయ‌న‌ సమీక్ష నిర్వ‌హించారు.

క్షేత్ర‌స్థాయి ప‌రిశీలన‌కు వెళ్లాలి..

ఈ సంద‌ర్భంగా తుమ్మ‌ల మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. కరువు పరిస్థితులను గుర్తించేందుకు వర్షపాతం, సాగు విస్తీర్ణం, నేల తేమ, రిజర్వాయర్ నిల్వలు, భూగర్భజలాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టాలి. మద్దతు ధర ప్రకటించడం, పెంచడంతో కేంద్రం బాధ్యత అయిపోదు.. ఆ ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్రం బాధ్యతే అని మంత్రి తుమ్మల స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement