త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్‌.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌..

BSNL | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) త‌న ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీచార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.51తో 28 రోజుల పాటు కనెక్టివిటీ ప్రయోజనాలను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో వెల్లడించింది.

S

Technology | Published On Sep 21, 2026, 3.53 pm IST

BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్‌.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌..
Advertisement

BSNL | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) త‌న ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీచార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.51తో 28 రోజుల పాటు కనెక్టివిటీ ప్రయోజనాలను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో వెల్లడించింది. ఈ ఆఫర్‌లో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ రీచార్జ్ ద్వారా ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ 28 రోజుల పాటు కొనసాగుతాయని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

https://twitter.com/BSNLCorporate/status/2101642648989913522?s=20

సిమ్ కార్డు ఫ్రీగానే..

ఈ ఆఫర్‌లో ఉచిత సిమ్ కూడా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అంటే కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు సిమ్ కార్డు కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని సంస్థ పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఆఫర్‌ను పొందాలనుకునే వారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్‌ను సంప్రదించాలని సూచించింది. అయితే, రీచార్జ్ నిబంధనలు, అందుబాటు ప్రాంతాలు, రూ.51 ధరకు సంబంధించిన అర్హతలను సేవా కేంద్రంలో నిర్ధారించుకోవడం మంచిది.

Advertisement
Advertisement