RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
RRR | రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
RRR | త్రినేత్ర.న్యూస్ : రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్యయం తగ్గుతుందని వివరించారు. కేంద్ర మంత్రి గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్ - విజయవాడల మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్ట్‌కు సరకు రవాణా వేగవంతమవుతుందని తెలిపారు.
మన్ననూరు - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు అటవీ శాఖ అనుమతులు
మన్ననూరు - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని గుర్తుచేశారు.
మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారి
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారికి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
తాజావార్తలు
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
- ●Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
- ●Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం





