Community Kitchen | మునగాలలో కమ్యూనిటీ కిచెన్.. 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
Community Kitchen | ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సూర్యాపేట జిల్లాలోని మునగాలలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్‌ను (Community Kitchen) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
Community Kitchen | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సూర్యాపేట జిల్లాలోని మునగాలలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్‌ను (Community Kitchen) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా కిచెన్ ద్వారా జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారు 60 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. మునగాల మండలంలో జాతీయ రహదారి పక్కన, మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో ఈ కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం నుంచి ఆహారం తయారు చేసి, ప్యాకింగ్, రవాణా, పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ వంటశాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.
సింగరేణి విరాళంతో..
కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి సింగరేణి (Singareni) కంపెనీ రూ. 9.60 కోట్ల విరాళం అందించింది. తానతోపాటు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి విజ్ఞప్తి మేరకు సింగరేణి ఈ నిధులను సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు.
1,029 విద్యాసంస్థలకు..
హరేకృష్ణ మూవ్మెంట్ (Hare krishna Movement) చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. జిల్లాలోని సుమారు 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం (Breakfast Scheme) తయారు చేసి సరఫరా చేయడం కమ్యూనిటీ కిచెన్ ప్రధాన ఉద్దేశం. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన కొన్ని జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందించే అంశాన్ని కూడా ప్రణాళికలో చేర్చారు.
నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం
వంటశాలలో ఆహార తయారీ, ప్యాకింగ్, రవాణా, పంపిణీ కోసం సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆహార నాణ్యత, పోషక విలువలు, పరిశుభ్రత, సురక్షిత నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థులకు పాఠశాల వేళల్లో పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, సంక్షేమానికి తోడ్పడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం, నిర్వహణ, ఆహార తయారీ, విద్యాసంస్థలకు సరఫరా వంటి అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సంబంధిత అధికారులు, అమలు భాగస్వాములతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ వంటశాల ద్వారా సూర్యాపేట జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
- ●Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే
- ●Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
- ●Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు

Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..

Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే






