Gaddam Prasad Kumar | స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ పండగను గ్రాండ్‌గా చేయండి: స్పీకర్ ప్రసాద్ కుమార్
Gaddam Prasad Kumar | స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ పండగను గ్రాండ్‌గా చేయాలని.. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
Gaddam Prasad Kumar | త్రినేత్ర న్యూస్: స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ పండగను గ్రాండ్‌గా చేయాలని.. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. విదేశాల్లో స్థిరపడినా మాతృభాషను, మన సంస్కృతి, సాంప్రదాయాలను మరువకుండా కాపాడుతుండడం అందరూ హర్షించదగ్గ విషయమన్నారు. చిన్న పిల్లలకు తెలుగు భాష నేర్పిస్తూ, బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలను నిర్వహిస్తూ భాషా సంస్కృతిని స్విట్జర్లాండ్ లో ఇనుమడింపజేయడం భావితరాలకు ఆదర్శమన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ లోని బెర్న్ సిటీలో గురువారం పర్యటించిన సందర్భంగా స్పీకర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా స్పీకర్ మిత్రులు బ్రహ్మానంద రెడ్డి బావిగడ్డ ఆహ్వానం మేరకు అక్కడి ప్రవాస తెలుగు భారతీయులతో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్ సైట్ ను, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను స్పీకర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రవాస తెలుగు సంఘం ప్రతినిధులతోనూ మాట్లాడారు.
స్విట్జర్లాండ్ లో నిర్మించబోయే వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి స్పీకర్ బృందానికి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. టెంపుల్ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు, సహాయ సహకారాల గురించి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతినిధులతో మాట్లాడి.. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు హామీ ఇచ్చారు.
బతుకమ్మ.. మన జీవన ప్రతీక
బతుకమ్మ ఉత్సవం అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళా శక్తికి, ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఇలా ఏటా స్విట్జర్లాండ్ లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంఘం ప్రతినిధులను స్పీకర్ బృందం అభినందించింది. ఈ నెల 24వ తేదీన స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశం, స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు కిరణ్ వేదాంతం, కార్యదర్శి హరి ప్రసాద్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త
- ●PM Modi | నోయిడా ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ పేరు.. యూపీ సర్కార్ సంచలన నిర్ణయం
- ●Maheshkumar Goud | సర్ మీద దేశమంతా కొట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడ్తలే
- ●Hexaware Technologies | ఆంథ్రోపిక్‌తో డీల్.. హెక్సావేర్ షేర్లకు జోష్..
- ●Janhvi Kapoor | టాలీవుడ్‌కు జాన్వీకపూర్ గుడ్‌బై? - స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీదేవి తనయ
- ●EPF | ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుతో రూ.7 లక్షల బీమా కవరేజీ పెరుగుతుందా?

GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త

PM Modi | నోయిడా ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ పేరు.. యూపీ సర్కార్ సంచలన నిర్ణయం

Maheshkumar Goud | సర్ మీద దేశమంతా కొట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడ్తలే

Hexaware Technologies | ఆంథ్రోపిక్‌తో డీల్.. హెక్సావేర్ షేర్లకు జోష్..





