Komatireddy Venkat Reddy | పెద్ద సూరారంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం.. మహిళలకు రూ.2.5 కోట్ల రుణాలు
Komatireddy Venkat Reddy | రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని పెద్ద సూరారం మహిళా సంఘాలకు ఆగస్టు 15నాటికి రూ.2.5 కోట్ల రుణాల చెక్కులు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
- సబ్‌స్టేషన్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం
- రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణం చేపడుతున్నాం
- పెద్ద సూరారంలో అభివృద్ధి పనుల సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని పెద్ద సూరారం మహిళా సంఘాలకు ఆగస్టు 15నాటికి రూ.2.5 కోట్ల రుణాల చెక్కులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.60 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పెద్ద సూరారంలో పలు అభివృద్ధి పనులను సమీక్షించిన అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

చిన్నసూరారం-పెద్ద సూరారం మధ్య రైస్ మిల్లు ఏర్పాటు..
గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పెద్ద సూరారం గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేశాం. సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసి నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల వంటి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవాలి. చిన్నసూరారం-పెద్ద సూరారం మధ్య రైస్ మిల్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో కూడా రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అని మంత్రి కోమటిరెడ్డి వివరించారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి. గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 25 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ఇకనుంచి ప్రతి వారం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటిస్తాను అని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జానమ్మ, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది



