త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | ఈ నెల 16 నుంచి కులవృత్తుల మేళా

Minister Ponnam Prabhakar | ఈ నెల 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

P

Telangana | Published On Jul 7, 2026, 5.45 pm IST

Minister Ponnam Prabhakar | ఈ నెల 16 నుంచి కులవృత్తుల మేళా
Advertisement
  • గురుకులాలు, హాస్ట‌ల్స్‌లో నాణ్య‌మైన వ‌స‌తులు క‌ల్పించాలి
  • స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యం
  • బీసీ సంక్షేమ‌శాఖ అధికారుల‌తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Minister Ponnam Prabhakar | ఈ నెల 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకులాలు, హాస్టల్స్‌ పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన 'క్లీన్ అండ్ గ్రీన్' వాతావరణంలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని గురుకులాలు, హాస్టళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారులు (డీబీసీవోలు) క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు తరచూ గురుకులాలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు.

స్టడీ సర్కిల్స్‌లో నాణ్యతను మరింత పెంచేందుకు, సివిల్స్‌తో పాటు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న స్టడీ సర్కిల్స్ విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో జరిగే కులవృత్తుల మేళాను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే కుట్టు మిషన్ పథకం అమలుకు సమగ్ర విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేసి అమలుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మికంగా గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇంకా కిట్లు అందని జిల్లాల్లో వెంటనే పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు, అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement