Drumstick Business | మునగకాయల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువకుడు
Drumstick Business | మహారాష్ట్ర( Maharashtra )లోని సంగోలా రీజియన్( Sangola region ) కరువు పీడిత ప్రాంతం. అక్కడ భూగర్భ జలాలు కూడా తక్కువే.. కానీ ఓ యువ రైతు మాత్రం కరువు( Drought )ను కాదనీ, నీటి వనరులు లేనప్పటికీ.. మునగకాయల సాగు( Drumstick Cultivation )తో కోట్ల రూపాయాలు గడిస్తున్నాడు. 2010లో 40 మొక్కలతో ప్రారంభించిన తన మునగకాయల వ్యాపారం( Drumstick Business ) ప్రస్తుతం 10 ఎకరాలకు విస్తరించింది. 7 వేల మొక్కలతో.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్నాడు సందీప్ కడెం( Sandip Kadam ) అనే యువ రైతు.
Agriculture | Published On Jul 7, 2026, 6.55 pm IST
Drumstick Business | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర( Maharashtra )లోని సంగోలా రీజియన్( Sangola region ) పరిధిలోని చిక్‌మహుద్ గ్రామానికి చెందిన సందీప్ కడెం( Sandip Kadam ) అనే యువ రైతుకు తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పది ఎకరాలు. అయితే ఈ భూమిలో తన కుటుంబ సభ్యులు గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలు పండించేవారు. కానీ ఈ పంటల దిగుబడి తక్కువే. లాభం కూడా పెద్దగా ఉండకపోయేది. నష్టాలు చవిచూసేవారు.
2005లో సందీప్ కడెం.. ఓ రెండు ఎకరాల పొలంలో వినూత్న ప్రయోగం చేశాడు. దానిమ్మ సాగు చేశాడు. కానీ దిగుబడి లేదు. నష్టాల బాటనే పట్టాడు. ఎందుకంటే చీడపీడలు పంటను పట్టి పీడించేవి. వీటి నిరోధానికి రసాయనాలు అధికంగా వాడాల్సి వచ్చేది.. దీంతో పెట్టుబడి ఎక్కువగా అయ్యేది.. దిగుబడి మాత్రం ఊహించినంత రాకపోయేది.. ఈ క్రమంలోనే సందీప్ కొత్త పంటల వైపు దృష్టి సారించాడు.
నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలపై శోధన
అయితే సందీప్ పొలం ఉన్న ప్రాంతంలో నీటి వనరులు తక్కువ కాబట్టి.. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలేవో శోధించాడు. కరువులోనూ సాగయ్యే పంటల్లో ఒకటి మునగ కాయల సాగు( Drumstick Cultivation ) అని గ్రహించాడు. ఈ మునగకాయలను ప్రతి వంటకంలోనూ వినియోగిస్తారు. అంతేకాదు మెడిసినల్ తయారీలోనూ ఉపయోగిస్తారు. మునగ ఆకులకు కూడా మార్కెట్‌లో భారీగానే డిమాండ్ ఉందన్న విషయం తెలుసుకున్నాడు సందీప్.
కరువు పీడిత ప్రాంతంలోనూ కనక వర్షం
ఇక 2010లో సందీప్ తమిళనాడు నుంచి ఓడీసీ( ODC ) వెరైటీకి సంబంధించి 40 మునగ మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. గతంలో 2 ఎకరాల్లో సాగు చేసిన దానిమ్మ స్థానంలో మునగ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆ 2 ఎకరాల్లో మునగ సాగు ప్రారంభించాడు. ఐదు నెలల్లోనే దిగుబడి వచ్చింది. ప్రతి మొక్క కూడా రూ. 1000 వరకు రాబడిని తీసుకొచ్చింది. మొత్తంగా 40 మొక్కలకు గానూ రూ. 40 వేల ఆదాయం సమకూరింది. దీంతో సందీప్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కరువు పీడిత ప్రాంతంలోనూ కనక వర్షం కురిపిస్తుందని నమ్మిన సందీప్.. తన మునగకాయల వ్యాపారం( Drumstick Business ) మరింత విస్తరించాడు.

తొలి రాబడి ఎకరాకు రూ. 2500 చొప్పున
ఆ తర్వాత మొత్తం 680 మొక్కలను నాటి సాగు చేశాడు. ఐదు నెలల వ్యవధిలోనే ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు మునగ కాయలు ఉత్పత్తి అయ్యాయి. కేజీ మునగ కాయలను రూ. 100 విక్రయించాడు. ఆ సమయంలో ఒక్కో మొక్క నుంచి ఉత్పత్తి అయిన మునగకాయలను విక్రయించగా రూ. 2500 చొప్పున రాబడి వచ్చింది. మళ్లీ ఐదు నెలల వ్యవధిలో ఈ స్థాయిలోనే ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 10 ఎకరాల్లో 7 వేల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రతి మొక్క కూడా 60 కేజీల వరకు దిగుబడిని ఇస్తుంది. ఏడాదికి 420 టన్నుల వరకు దిగుబడి ఉంది.

దుబాయికి ఎగుమతి
ఇక తన పొలంలో పండించిన మునగ కాయలను సొంతంగా మార్కెట్ చేసుకున్నాడు సందీప్. హైదరాబాద్, పుణె, బెంగళూరు, తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. మొత్తం దిగుబడిలో 20 శాతం వరకు దుబాయికి ఎగుమతి చేస్తుండగా, మిగిలిన 80 శాతం దిగుబడిని దేశీయంగా వివిధ మార్కెట్లకు విక్రయిస్తున్నాడు.
పది ఎకరాలకు రూ. 2.25 కోట్ల వరకు ఆదాయం
ఇక ఎకరాకు 4,200 కేజీల వరకు మునగ కాయలు దిగుబడిని ఇస్తున్నాయి. వీటిని కేజీకి రూ. 60 చొప్పున విక్రయించిన ఎకరాకు రూ. 25 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంటే పది ఎకరాలకు రూ. 2.25 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇందులో ఏడాది సాగుకు సంబంధించిన పెట్టుబడి ఎకరాకు రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. ఎకరాకు రూ. 23.5 లక్షల వరకు ఆదాయం మిగులుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
ఆగస్టు 24, 2026

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
ఆగస్టు 24, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



