త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | అల్లు అర్జున్ “రాకా”లో క్రేజీ బ్యూటీ – ఊహించని కాంబినేషన్ సెట్ట‌య్యిందా?

శ్రీలీల తెలుగులో మ‌రో బంప‌రాఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్ రాకాలో ధమాకా బ్యూటీ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే ముంబైలో రాకా మూవీ సెట్స్‌ను శ్రీలీల సంద‌ర్శించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Jul 7, 2026, 6.53 pm IST

Sreeleela | అల్లు అర్జున్ “రాకా”లో క్రేజీ బ్యూటీ – ఊహించని కాంబినేషన్ సెట్ట‌య్యిందా?
Advertisement

Sreeleela | అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న రాకా మూవీ రోజుకో అప్‌డేట్‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్‌తో పాటు లుక్ గురించి సోష‌ల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో న‌టించే హీరోయిన్లు ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో న‌లుగురు హీరోయిన్లు న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. కానీ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం దీపికా ప‌డుకోణ్‌ను మాత్ర‌మే అధికారికంగా ఫైన‌ల్ చేశారు. మ‌రో నాయిక‌గా ర‌ష్మిక మంద‌న్న ఖ‌రారైన‌ట్లు టాక్‌. త్వ‌ర‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్ రాకా మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతుంది. మిగిలిన నాయిక‌లుగా జాన్వీ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్ క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

రాకా సెట్స్‌లో...

తాజాగా రాకాలో మ‌రో సౌత్ బ్యూటీ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో శ్రీలీల న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రాకా షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఈ మూవీ సెట్స్‌ను శ్రీలీల సంద‌ర్శించింది. అల్లు అర్జున్‌, అట్లీల‌తో చాలా సేపు మంత‌నాలు జ‌రిపింది. రాకా సెట్స్‌ను శ్రీలీల విజిట్ చేయ‌డంతో ఈ సినిమాలో శ్రీలీల న‌టించ‌బోతుందంటూ సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. ఐదో హీరోయిన్‌గా న‌టించ‌నుందా? లేదంటే జాన్వీ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్‌ల‌లో ఒక‌రి స్థానాన్ని ఈ ధ‌మాకా బ్యూటీ భ‌ర్తీ చేయ‌నుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ట‌ర్నింగ్ పాయింట్‌....

ఒక‌వేళ శ్రీలీల‌కు ఛాన్స్ ద‌క్కితే మాత్రం ఆమె కెరీర్‌కు రాకా మూవీ ఓ ట‌ర్నింగ్ పాయింట్‌లా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే డిజాస్ట‌ర్ల‌తో టాలీవుడ్‌కు దూర‌మైంది. ఫ్లాపుల ఎఫెక్ట్‌తో ఆమెకు అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ద‌ర్శ‌కులెవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇలాంటి బ్యాడ్ టైమ్‌లో అల్లు అర్జున్ సినిమాలో అవ‌కాశం ద‌క్క‌డం అంటే అదృష్ట‌మ‌నే టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

పుష్ప 2లో స్పెష‌ల్ సాంగ్‌...

అల్లు అర్జున్ గ‌త మూవీ పుష్ప 2లో కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల న‌టించింది. ఆ పాట క‌న్న‌డ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. మ‌రోసారి ఈ కాంబో సెట్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో రాకా మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో టాలీవుడ్‌కు దూర‌మైన శ్రీలీల ప్ర‌స్తుతం త‌మిళంలో ధ‌నుష్‌తో ఓం సినిమా చేస్తోంది. ఈ యాక్ష‌న్ మూవీలో సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

 

Advertisement
Advertisement