KA Paul | కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేఏ పాల్
KA Paul | కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi)ని గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు మాట్లాడడానికి భయపడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
KA Paul | కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi)ని గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు మాట్లాడడానికి భయపడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం నిర్వహించారని, కానీ గత ఎన్నికల సమయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలపై చర్చ జరగలేదని మండిపడ్డారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనికోసం న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించానని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరుతాయని, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగాలని, అందరం కలిసి పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదా వచ్చి తీరాలని, మోడీ ప్రభుత్వం ఇచ్చి తీరాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లేదు, అక్కడ ఉన్న రెండు పార్టీల ఎంపీలు కేంద్రానికి మద్దతే ఇస్తున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేయించామని, డ్రీం లెవెల్ యాప్ ను క్లోజ్ చేయించామని వివరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు భయపడుతూ పోతే ఆంధ్రులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కేంద్రంపై నోరు విప్పితే లోపల పెడతారు అనే టెన్షన్ నేతలకు పట్టుకుందని దుయ్యబట్టారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైందని, కానీ మనకు దరిద్రం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ కొడుకు అగ్నివేశ్ అగర్వాల్ న్యూయార్క్ లో చనిపోయారని, ఇది చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంబంధిత వార్తలు

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026

Parle Industries | మెలోడీ ఎఫెక్ట్.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ర్యాలీ..
మే 20, 2026

PM Modi Netherlands Visit | నెదర్లాండ్స్లో ప్రధాని మోదీ పర్యటన: ప్రవాసుల సభలో ‘ఝల్ మురి’ నుంచి ఒలింపిక్స్ దాకా ఆసక్తికర ప్రసంగం
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



