Virat Kohli | చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రన్ మెషిన్..
Virat Kohli | టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో వడోదరలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు.
Virat Kohli | టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో వడోదరలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ ఫీట్‌కు 25 పరుగుల విరాట్ ఉండగా.. స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్ ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరాడు. 624 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించి సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరల రికార్డులను అధిగమించాడు. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ 644 ఇన్నింగుల్లో, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 666 ఈ ఫీట్‌ను అందుకున్నారు.
296 వన్డేల్లో..
28వేల పరుగుల్లో విరాట్ 296 వన్డేల్లో 53 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలతో మొత్తం 14557* పరుగులు చేశాడు. 210 టెస్టుల్లో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 9,230 పరుగులు సాధించాడు. ఇక 117 టీ20ల్లో సెంచరీ 38 హాఫ్ సెంచరీలతో 4,188 పరుగులు చేశాడు ఈ రన్ మెషిన్. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంగక్కరను అధిగమించాడు విరాట్. లంక మాజీ కెప్టెన్ 666 ఇన్నింగ్స్‌ల్లో 63 సెంచరీలు, 153 అర్ధసెంచరీల సహాయంతో 28,016 పరుగులు చేశాడు. సచిన్ శత సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలతో మొత్తం 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, సచిన్ ఈ రికార్డుకు విరాట్ ఆమడ దూరంలో ఉన్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్ వరకు విరాట్ అందుబాటులో ఉండి.. ఇదే ఫామ్‌ను కొసాగిస్తే వంద సెంచరీల రికార్డును మాత్రం బ్రేక్ చేసే అవకాశం ఉంది.
సచిన్ శత శతకాల రికార్డుకు..
సచిన్ శత సెంచరీల రికార్డుకు విరాట్ ఇంకా 17 సెంచరీల దూరంలో ఉన్నాడు. విరాట్ ఇంకా 30 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ప్రపంచకప్ వరకు టీమిండియా కేవలం 30 వన్డేలు మాత్రమే ఆడనున్నది. ఇక విరాట్ ఈ ఘనతను సాధించాలంటే 2027 వరల్డ్ కప్ ఫైనల్ చేరితే.. టీమిండియా 30 మ్యాచులు ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత ఆరునెలల వరకు టీమిండియా మళ్లీ వన్డేలు ఆడే అవకాశం లేదు. ఇప్పటికే విరాటు టెస్టులతో పాటు టీ20 రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీలో మిస్ చేసుకున్నాడు. కైల్ జేమిసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 91 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 93 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
విరాట్, రోహిత్‌కు బీసీసీఐ సన్మానం..
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను బీసీసీఐ వినూత్నంగా సత్కరించింది. వడోదర వేదికగా తొలిసారిగా పరుషుల వన్డే మ్యాచ్‌ను నిర్వహించిన నేపథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మల ఫొటోలతో కూడిన కప్ బోర్డును మైదానంలోకి తీసుకొచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లను మైక్‌లో అనౌన్స్ చేయగానే అందులో నుంచి ఇద్దరు బయటకు రాగా.. అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్షాస్, ఉపాధ్యక్షుడు రాజీశ్ శుక్లా హాజరయ్యారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






