త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | 20న తెలంగాణ బ‌డ్జెట్.. ఆరు రోజులే ప‌ని దినాలు

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల ప‌నిదినాలు ఖ‌రారు అయ్యాయి. బ‌డ్జెట్‌ను ఈ నెల 20న స‌భ‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మార్చి 30వ తేదీ వ‌ర‌కు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కొన‌సాగించ‌నున్నారు. అ

S

Telangana | Published On Mar 16, 2026, 3.35 pm IST

Telangana Assembly | 20న తెలంగాణ బ‌డ్జెట్.. ఆరు రోజులే ప‌ని దినాలు
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల ప‌నిదినాలు ఖ‌రారు అయ్యాయి. బ‌డ్జెట్‌ను ఈ నెల 20న స‌భ‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మార్చి 30వ తేదీ వ‌ర‌కు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కొన‌సాగించ‌నున్నారు. అయితే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామ‌న‌వమితో పాటు ఆదివారాలు పోనూ కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.

17, 18 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి చ‌ర్చించి, ఆమోదం తెలుపనున్నారు. మార్చి 19న ఉగాది పండుగ నేప‌థ్యంలో సెల‌వు ప్ర‌క‌టించారు. 20న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 21న రంజాన్, 22న ఆదివారం సెలవులు. మ‌ళ్లీ 26న శ్రీరామ‌న‌వ‌మి కార‌ణంగా అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. 29న ఆదివారం మ‌ళ్లీ సెల‌వు. మొత్తంగా సెల‌వులు పోనూ కేవ‌లం ఆరు రోజుల మాత్ర‌మే స‌భ జ‌ర‌గ‌నుంది.

Advertisement
Advertisement