BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
BTech student | హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ (Hayathnagar)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి (BTech student) దుర్మరణం చెందాడు. మృతుడు నల్గొండ పట్టణానికి చెందిన ఏమిరెడ్డి అభిలాష్ (Emireddy Abhilash Reddy) రెడ్డిగా గుర్తించారు.
BTech student | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో (truck hit motorcycle) బీటెక్ విద్యార్థి (BTech student) ప్రాణాలు కోల్పోయాడు. నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ పట్టణానికి (Nalgonda town) చెందిన ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి (Emireddy Abhilash Reddy) నగరంలోని సీవీఆర్ కాలేజీలో (CVR College) బీటెక్ చదువుతున్నాడు. తన మిత్రుడిని హయత్‌నగర్ బస్టాండ్‌లో దింపి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అభిలాష్ రెడ్డి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పోలీసులు గుర్తించారు. చేతికి అందిన కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
Also Read..
రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
- ●Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..
- ●Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్
- ●Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!

Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?

Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి

Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..






