Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
Gold And Silver Prices Today | ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతుండడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అలాగే డాలర్ మళ్లీ బలపడుతుండడం బంగారంపై ఒత్తిడిని పెంచుతోంది. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
Gold And Silver Prices Today | ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతుండడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అలాగే డాలర్ మళ్లీ బలపడుతుండడం బంగారంపై ఒత్తిడిని పెంచుతోంది. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.20 శాతం తగ్గి 4,008 డాలర్లకు చేరగా, వెండి ధర 1.35 శాతం మేర పతనమై 53 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 395 పాయింట్లు తగ్గి 1,42,678కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,213 పాయింట్లు తగ్గి 1,93,654కు చేరుకుంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక మోస్తరుగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,329 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,632 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,32,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.5,400 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,135 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,13,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,757 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,056గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,570 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,75,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,20,000 ఉండగా, తులం ధర రూ.2,200గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,20,000 ఉండగా, తులం ధర రూ.2,200 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
అక్టోబర్ 26, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తగ్గని అస్థిరత.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
అక్టోబర్ 24, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్కు దరఖాస్తు..?
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
- ●Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..
- ●Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్
- ●Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!

Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్కు దరఖాస్తు..?

Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి

Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..



