Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్
Jailbreak | మూర్ఛ వస్తున్నట్లు నాటకం ఆడిన ఖైదీలు ఆడి సినీ ఫక్కీలో జైలు నుంచి (Jailbreak) తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలులో (Theni sub-jail) జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తున్నది.
Jailbreak | త్రినేత న్యూస్: మూర్ఛ వస్తున్నట్లు నాటకం ఆడిన ఖైదీలు ఆడి సినీ ఫక్కీలో జైలు నుంచి (Jailbreak) తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలులో (Theni sub-jail) జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తున్నది. జైలులోని ఓ గదిలో 17 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందడంతో జైలు సిబ్బంది ఆ గదికి వెళ్లారు. ప్లాన్‌లో భాగంగా ఓ ఖైదీ ఫిట్స్ (Seizure) వచ్చినట్లు నటించగా.. మిగిలినవారు సిబ్బందిపై దాడిచేసి అక్కడి నుంచి పారిపోయారు (Inmates Escape).
అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించారు. పరారైన ఖైదీల కోసం 16 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పరారైన ఖైదీల్లో ఒకరిని తిరిగి అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
సిబ్బంది దాడి చేసిన ఖైదీలు అక్కడి నుంచి పారిపోయినట్లు సౌత్‌జోన్ ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని వెల్లడించారు. జైలు వెనుక అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్తగా జిల్లాలో 16 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు దిండిగల్ జిల్లా ఎస్పీ ఎస్. జయకుమార్ చెప్పారు. దిండిగల్-తేని రహదారిపై వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామన్నారు.
సంబంధిత వార్తలు

Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ – విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన
అక్టోబర్ 22, 2026

IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
అక్టోబర్ 19, 2026

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!
- ●Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్
- ●Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 29న ఢిల్లీలో ఘనంగా కర్టెన్ రైజర్
- ●TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు
- ●Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!
- ●Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ

Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!

Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్

Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 29న ఢిల్లీలో ఘనంగా కర్టెన్ రైజర్

TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు



