త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి.. జ‌స్టిస్ శ్యామ్ కోషికి ప‌దోన్న‌తి

High Court CJ | తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (High Court CJ) జ‌స్టిస్ త‌ప‌బ్ర‌త చ‌క్ర‌వ‌ర్తి (Justice Tapabrata Chakraborty) నియ‌మితులు కానున్నారు. ప్ర‌స్తుతం కోల్‌క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న ఆయ‌నకు తెలంగాణ సీజేగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార‌సు చేసింది.

G

Telangana | Published On Oct 27, 2026, 10.15 am IST

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి.. జ‌స్టిస్ శ్యామ్ కోషికి ప‌దోన్న‌తి
Advertisement

High Court CJ | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (High Court CJ) జ‌స్టిస్ త‌ప‌బ్ర‌త చ‌క్ర‌వ‌ర్తి (Justice Tapabrata Chakraborty) నియ‌మితులు కానున్నారు. ప్ర‌స్తుతం కోల్‌క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న ఆయ‌నకు తెలంగాణ సీజేగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార‌సు చేసింది. అలాగే ప్ర‌స్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీగా సేవ‌లందిస్తున్న జ‌స్టిస్ పీ. శ్యామ్ కోషిని (Justice P. Sam Koshy) ఢిల్లీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ తీర్మానం చేసింది. తెలంగాణ, ఢిల్లీతోపాటు ఉత్త‌రాఖండ్‌, గుజ‌రాత్ హైకోర్టుల‌కూ నూత‌న ప్ర‌ధాన న్యాయమూర్తులను నియమిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని కొలీజియం సిఫార‌సు చేసింది.

గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మానస్ రంజన్ పాఠక్‌ను (Justice Manash Ranjan Pathak) అదే కోర్టుకు చీఫ్ జస్టిస్‌గా ప‌దోన్న‌తి క‌ల్పించారు. ఇక‌ పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ సింగ్‌ను (Justice Sudhir Singh) ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మించింది. కాగా, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించిన విష‌యం తెలిసిందే. వారు ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నత న్యాయస్థానాల్లో సీజే పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలను భర్తీ చేస్తూ కొలీజియం తాజాగా నియామకాలను ఖరారు చేసింది. కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించిన అనంతరం రాష్ట్రపతి ఈ నియామక ఉత్తర్వులను అధికారికంగా జారీ చేస్తారు.

జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి..

జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి 1967లో పశ్చిమబెంగాల్‌లో జన్మించారు. 1991 జనవరి 29న కలకత్తా హైకోర్టులో (Calcutta High Court) న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సివిల్‌, రాజ్యాంగ, సర్వీసు, విద్యాచట్టాలకు సంబంధించిన కేసుల్లో సుమారు 22 ఏండ్ల‌పాటు న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేశారు. 2013 అక్టోబర్‌ 30న క‌ల‌కత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం 2016 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియ‌మితుల‌య్యారు. 2026 జూన్‌ 21 నుంచి కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ ప్ర‌తిపాదించింది.

Advertisement
Advertisement