RTC Bus | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు
RTC Bus | రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ (Hayathnagar) సమీపంలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును (RTC Bus) టిప్పర్ ఢీకొట్టింది.
RTC Bus | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ (Hayathnagar) సమీపంలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును (RTC Bus) టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హనుమకొండలో (Hanumakonda) జరిగిన ఘటనలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద సిరిసిల్ల (Sircilla) డిపోనకు చెందిన బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకున్నాయి. దీంతో భారీ వృక్షం ఒక్కసారిగా కిందపడిపోయింది. అక్కడ ఆగిఉన్న రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సును అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ
తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు pic.twitter.com/wkx8edxpm9
https://youtube.com/shorts/q1tJ-PBhX6U?si=t0T1Fhp_oOE4E_Ub
తాజావార్తలు
- ●Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..
- ●AI Safety Risks | ఇక నావల్ల కాదు.. వచ్చే ఐదేళ్లలో ఏఐతో పెను విపత్తు రాబోతోందంటూ గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్ రాజీనామా
- ●Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు
- ●NYC Subway Accident | విషాదం.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న జంట : VIDEO
- ●Meta | చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం.. అక్రమ కంటెంట్‌పై పోలీసులకు సమాచారం..
- ●Refrigerator Explodes | పేలిన ఫ్రిడ్జ్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..

AI Safety Risks | ఇక నావల్ల కాదు.. వచ్చే ఐదేళ్లలో ఏఐతో పెను విపత్తు రాబోతోందంటూ గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్ రాజీనామా

Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు

NYC Subway Accident | విషాదం.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న జంట : VIDEO






