త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | గొంతు మీద కత్తి పెట్టి.. నాది పులివెందుల అన్నడు

KTR | తెలంగాణ ఉద్య‌మ( Telangana Movement ) స‌మ‌యంలో అరెస్ట‌యి వ‌రంగ‌ల్ జైల్లో ఉన్న సంద‌ర్భంగా జ‌రిగిన ఓ అనుభవాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).. ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శేఖ‌ర్ మెమోరియ‌ల్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో పంచుకున్నారు.

S

Telangana | Published On Jul 19, 2026, 4.00 pm IST

KTR | గొంతు మీద కత్తి పెట్టి.. నాది పులివెందుల అన్నడు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ( Telangana Movement ) స‌మ‌యంలో అరెస్ట‌యి వ‌రంగ‌ల్ జైల్లో ఉన్న సంద‌ర్భంగా జ‌రిగిన ఓ అనుభవాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).. ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శేఖ‌ర్ మెమోరియ‌ల్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో పంచుకున్నారు. ఆ రోజు జైల్లో త‌న‌కు ఓ ఖైదీ గ‌డ్డం గీస్తూ.. గొంతు మీద క‌త్తి పెట్టి నాది పులివెందుల అన్న‌డు.. ఇగ నా నోటి నుంచి మాట రాలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.

కేటీఆర్ అనుభ‌వం.. ఆయ‌న మాట‌ల్లోనే..

స‌రిగ్గా న‌వంబ‌ర్ 29 నాడు.. వ‌రంగ‌ల్ జైల్లో ఆ రాత్రంతా అక్క‌డే గ‌డిపినం. పాపం జైల‌ర్ గారు మంచోడు. జైల‌ర్‌తో పాటు అక్క‌డున్న సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలె క‌దా స‌ర్.. త‌ప్పేమున్న‌ది స‌ర్ అని చెబుతూ పాపం వాళ్లు బాగా చూసుకున్న‌రు. స‌ర్ మీరు సెల్‌లో ఎందుకు ప‌డుకుంట‌రు.. హాస్పిట‌ల్‌లో ప‌డుకోండి అని అన్న‌రు. స‌రే మీరు ఎక్క‌డ చెబితే అక్క‌డ ప‌డుకుంటం.. జైల్లో ఉన్నాం.. ఎక్క‌డంటే అక్క‌డ ప‌డుకున్నం. తెల్లారి 6 గంట‌ల‌కు నిద్ర లేపిండ్రు. చాయ్ తాగుతరా అంటే తాగుతం అంటే తీసుకొచ్చిర్రు.. తాగినం. ఇక గ‌డ్డం కూడా గీశారు. ఎట్లాంటి ప‌రిస్థితి అంటే.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయి నాలుగు నెల‌లైంది స‌రిగ్గా అప్ప‌టికీ. కేసీఆర్ గారూ నిరాహార దీక్ష‌కు కూర్చున్న‌రు. ఒక ఉద్విగ్న‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం రాష్ట్ర‌మంతటా ఉంది. తెలంగాణ రావాల‌ని తెలంగాణ‌లో.. వ‌ద్ద‌ని ఇంకో చోట‌. అట్లాంటి ప‌రిస్థితుల నేప‌థ్య‌మ‌ది. జైల్లోనే ఓ సోద‌రుడు గ‌డ్డం గీస్తున్నడు. ఇక ఏదో ఒక‌టి ముచ్చ‌ట పెట్టాలె క‌దా.. ఇక ఏ ఊరు త‌మ్ముడు అని అడిగిన‌. క‌రెక్ట్ క‌త్తి గొంతు వ‌ద్ద‌ ఉంది.. పులివెందుల స‌ర్ అన్న‌డు. ఇగ ముచ్చ‌ట బంద్ అడికి. ఏం మాట్లాడుత‌వ్ ఇక‌. అప్పుడే రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చ‌నిపోయి నాలుగు నెల‌లైంది. మ‌న‌మేమో తెలంగాణ అని లొల్లిపెట్టి ఆగ‌మాగం చేస్తున్నం. ఆ సోద‌రుడు పులివెందుల‌. ఏదో మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట‌యి జైల్లో ఉన్న‌డు. క‌త్తి గొంతు వ‌ద్ద ఉంది.. ఇంకేం మాట్లాడుతం. వామ్మో ఇది ఏటో ఉంద‌ని చెప్పి ఏం మాట్లాడ‌క‌పోయే స‌రికి ఆయ‌న న‌వ్వి.. లేదు స‌ర్ నాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారంటే ఇష్ట‌మే. కేసీఆర్ గారంటే కూడా ఇష్టం.. నాకు ఫైట‌ర్లు ఇష్టం. కొట్లాడేటోళ్లు అంటే ఇష్టం స‌ర్.. అని చెప్పి చాలా మ‌ర్యాద‌గా మాట్లాడ‌రు. అంటే కార్టూనిస్టులు కూడా ఇట్ల త‌యారైత‌రు. మెడ మీద క‌త్తిపెట్టి నా కార్టూన్ ఎట్ల ఉంది చెప్త‌వ‌.. చ‌స్త‌వా.. అని అడుగుతుంట‌రు.. కానీ రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా ఆ ఫెసిలిటీ ఉంటే బాగుండేది.. కానీ ఆ ఫెసిలిటీ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement