Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ – రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్‌డేట్
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఓడించిన రాణిగా బెలవాడి మల్లమ్మ చరిత్రలో నిలిచిపోయింది. ఆ రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కనిపించబోతుంది. రిషబ్ శెట్టి హీరోగా ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఛత్రపతి శివాజీ పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బెలవాడి మల్లమ్మ పాత్రలో భూమి ఫడ్నేకర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Entertainment | Published On Jul 27, 2026, 2.04 pm IST
Bhumi Pednekar | కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా ఈ పాన్ ఇండియన్ మూవీని రూపొందిస్తోన్నారు.
అప్‌డేట్ రివీల్...
ఛత్రపతి శివాజీ మూవీపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ఈ హిస్టారికల్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. బెలవాడి సంస్థానాన్ని పాలించిన మల్లమ్మ పాత్రలో భూమి ఫడ్నేకర్ నటిస్తున్నట్లు వెల్లడించారు. భారత చరిత్రలో మహిళా సైన్యాన్ని ఏర్పాటుచేసిన తొలి రాణిగా బెలవాడి మల్లమ్మ ప్రసిద్ధి చెందింది. ఆ రాణి పాత్రలో భూమి ఫడ్నేకర్ కనిపించబోతున్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్, మల్లమ్మ మధ్య యుద్ధం జరిగినట్లు పలు చారిత్రక గ్రంథాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో శివాజీని మల్లమ్మ ఓడించినట్లు కూడా పలువురు చరిత్ర కారులు తెలిపారు. దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు శివాజీ, మల్లమ్మ మధ్య యుద్ధం సాగినట్లు పలు గ్రంథాల్లో రాసి ఉంది.
టచ్ చేయని అంశాలతో...
శివాజీ, బెలవాడి మల్లమ్మ మధ్య సంఘర్షణను ఛత్రపతి శివాజీ మూవీలో ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. శివాజీ గురించి ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాలతో సందీప్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లుతెలిసింది. బెలవాడి మల్లమ్మ పాత్ర కోసం భూమి ఫడ్నేకర్ హార్స్ రైడింగ్, యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఏడాది....
ఈ సినిమాలో అర్జుర్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ ఓ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mrunal Thakur | 2022లో షూటింగ్ కంప్లీట్ – 2026లో రిలీజ్ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
జులై 21, 2026

Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? – విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !
జులై 7, 2026

Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం – సమంత సినిమాకు లాభాలు – రష్మిక సినిమాకు నష్టాలు
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..



