Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
Ramchandar Rao | ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏండ్లకు తగ్గించాలన్న రేవంత్ ప్రతిపాదన యువతను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జెన్-జీ యువత ప్రశ్నిస్తారనే భయంతోనే సీఎం రేవంత్ కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
- యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి విద్యాశాఖ బాధ్యతలు ఇవ్వండి
- విద్యా వ్యవస్థలో ఫండ్స్ క్రంచ్.. ఫ్యాకల్టీ క్రంచ్ ఉంది
- రేవంత్ తక్షణమే తప్పుకోవాలి
- మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏండ్లకు తగ్గించాలన్న రేవంత్ ప్రతిపాదన యువతను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జెన్-జీ యువత ప్రశ్నిస్తారనే భయంతోనే సీఎం రేవంత్ కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని తప్పించి యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించి నిరూపించుకోవాలన్నారు. విద్యాశాఖలో విఫలమైన రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.
శాసనసభ్యుడికి అనుభవం అవసరమని అంబేద్కర్ చెప్పారు..
25 ఏళ్ల కనీస వయస్సు రాజ్యాంగ నిర్మాతల ఆలోచనతో వచ్చింది. శాసనసభ్యుడికి అనుభవం అవసరమని అంబేద్కర్ చెప్పారు. మా పార్టీ ఇప్పటికే యువ నాయకుడు నితిన్ నబిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించి యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా యువత విశ్వాసం బీజేపీపైనే ఉంది. అందుకే బీజేపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచింది అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఫండ్స్ క్రంచ్.. ఫ్యాకల్టీ క్రంచ్.. ఇదే కాంగ్రెస్ పాలన. 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. యూనివర్సిటీలకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రేవంత్ ప్రభుత్వ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో వేలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలన్నీ గాలిలో కలిశాయ్..
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు.. ఇలా ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. ఉచిత స్కూటర్లు, 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు, యూత్ కమిషన్.. కాంగ్రెస్ హామీలు అన్నీ గాలిలో కలిశాయి. విద్యార్థులు, యువత, యూనివర్సిటీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలి అని రాంచందర్‌రావు సూచించారు.
దేశానికి యువ సాధికారతపై నీతులు చెప్పడంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువత మాత్రం ఘోరంగా విఫలమైంది. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు నుంచి నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, స్కూటర్లు, వడ్డీలేని రుణాల వరకు ఇచ్చిన ప్రతి ప్రధాన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసి, తెలంగాణ యువతను మోసం చేసిన రేవంత్ రెడ్డికి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించే నైతిక హక్కు ఏమాత్రం లేదు. ఆయన తక్షణమే తప్పుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
- ●Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
- ●Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...
- ●MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?
- ●Bhatti Vikramarka | ఉచితాలు కావు... ప్రజా పెట్టుబడులు
- ●Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..

Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...

MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?




