Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ – ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. అతది పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 27, 2026, 2.43 pm IST
Venkatesh | వెంకటేష్ హీరోగా నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరితో పాటు వాసు సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమాల్లో వెంకటేష్ కామెడీ టైమింగ్, పంచ్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఏకే 47 సినిమా చేస్తున్నాడు. ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
రెండు నెలల ముందే...
అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కు మరో రెండు నెలల ముందుగానే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. అతడి పాత్ర పరిచయానికి సంబంధించిన గ్లింప్స్‌ను సోమవారం రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శైలి పంచ్‌లు, హ్యూమర్‌తో ఈ గ్లింప్స్ ఫన్నీగా సాగింది. కిచెన్‌లో ఏసీ ఉంది...నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకొని చేసుకోవచ్చు...వాషింగ్ మెషిన్ కూడా ఉంది. నీకు పని బాగా తగ్గిపోయినట్లే అంటూఐ శ్రీనిధి డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. నాకు ఎవరూ ఏ పని చేసినా నచ్చదు. అన్ని నేనే చూసుకుంటా అర్థమైందా అని వెంకటేష్ అనగా...అర్థమైంది...ఆవిడకు ఏం రాదు...అన్ని మీరే చేసుకుంటారు అని రఘుబాబు అనడం నవ్వులను పంచుతోంది. మ్యాన్ ఆఫ్ ది హౌస్ అంటూ వెంకటేష్ పాత్రను పరిచయం చేయడం ఆకట్టుకుంటోంది. ఆదర్శ కుటుంబం అని నారా రోహిత్ చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్ ఎండ్ చేశారు. చివరలో ఒంటిపై గాయాలతో వెంకటేష్, శ్రీనిధి శెట్టి కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
తమన్ మ్యూజిక్...
ఈ సినిమాలో స్వర్ణ అనే పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మంగళవారం రిలీజ్ చేయబోతున్నారు. యువీనా పార్థవి, రాజా ప్రజ్వల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శైలి ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు థ్రిల్లర్ అంశాలతో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Excited to introduce you all to Chittibabu from the world of #AadarshaKutumbam 🤗
– https://t.co/P2i3fDr2GD #AK47OnOCT2nd | #AK47 | #Venky77 | #VenkateshXTrivikram #Trivikram @nara_rohith #UdbayBhirSandhu @musicthaman #SRadhaKrishna @vamsi84 @dop007 @sreekar_prasad… pic.twitter.com/FejXWONDaO
— Venkatesh Daggubati (@VenkyMama) July 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే – హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
జులై 26, 2026

Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ – కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
జులై 26, 2026
తాజావార్తలు
- ●Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..
- ●Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..

Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..

NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం



