త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | ఆర్టీసీ స‌మ్మె.. పొన్నం ప్ర‌భాక‌ర్‌పై శ్రీధ‌ర్ బాబు కుట్ర..?

RTC Strike | ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న స‌మ్మెకు బీఆర్ఎస్ నైతిక మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల‌కు డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కేటీఆర్ ప్ర‌భుత్వానికి సూచించారు.

S

Telangana | Published On Apr 22, 2026, 7.48 pm IST

RTC Strike | ఆర్టీసీ స‌మ్మె.. పొన్నం ప్ర‌భాక‌ర్‌పై శ్రీధ‌ర్ బాబు కుట్ర..?
Advertisement

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న స‌మ్మెకు బీఆర్ఎస్ నైతిక మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల‌కు డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కేటీఆర్ ప్ర‌భుత్వానికి సూచించారు. కాళేశ్వ‌రంపై హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా.. కేటీఆర్‌ను ప‌లువురు జ‌ర్న‌లిస్టులు ఆర్టీసీ స‌మ్మెపై ప్ర‌శ్నించారు. ఆర్టీసీ స‌మ్మె వెనుకాల బీఆర్ఎస్ పార్టీ ఉంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నార‌ని కేటీఆర్‌ను అడిగారు.

కేటీఆర్ స్పందిస్తూ.. పొన్నం ప్ర‌భాక‌ర్ అంటే గౌర‌వం ఉంది.. మేనిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ శ్రీధ‌ర్ బాబు.. 28 పేజీలో ఏం రాశాడో ఆర్టీసీ కార్మికుల గురించి ఏం రాశారో చ‌ద‌వండి. కార్మికులు అడుగుతున్న‌ది రెండున్న‌రేండ్ల త‌ర్వాత‌. పాపం ఓపిక ప‌ట్టారు. స‌గం టైమ్ అయిపోయింది.. స‌గం టైం ఏంటి 60 శాతం ఒడిసిపోయింది. మూడు బ‌డ్జెట్‌లో ఒడిసిపోయాయి. ఇప్ప‌టికైనా మేనిఫెస్టోలో ఏం రాశారో ఇప్ప‌టికైనా చ‌దువుకోండి. మ‌రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు ఆర్టీసీ మంత్రి వ‌స్త‌ద‌ని శ్రీధ‌ర్ బాబు ముందే ఏమైనా కుట్ర ప‌న్ని ఏమైనా చేశారో నాకు తెల్వ‌దు.. మేం అయితే చేయ‌లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement