KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్
KTR | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌తో ఇతర కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జెన్‌కోకు థర్డ్ గ్రేడ్ కోల్‌ను సప్లై చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. జెన్‌కోకు సింగరేణి నాసిరకం బొగ్గు సప్లై చేయడం వల్ల రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయింది అని కేటీఆర్ తెలిపారు.
నాసిరకం బొగ్గు సప్లై వల్ల రూ. 2,900 కోట్ల ప్రజాధనం వృథా
సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52 వేల కోట్లు బాకీ
అందుకే థర్డ్ గ్రేడ్ బొగ్గు సరఫరా
మీడియా సమావేశంలో కేటీఆర్
KTR | త్రినేత్ర న్యూస్ : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌తో ఇతర కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జెన్‌కోకు థర్డ్ గ్రేడ్ కోల్‌ను సప్లై చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. జెన్‌కోకు సింగరేణి నాసిరకం బొగ్గు సప్లై చేయడం వల్ల రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయింది అని కేటీఆర్ తెలిపారు. వైటీపీఎస్‌తో పాటు థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన ఘటనలపై బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేస్తున్నారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన పేపర్‌లోనే వార్త వచ్చింది. జెన్‌కో అనే సంస్థకు ఫస్ట్ ప్రియారిటీ కింద సింగరేణి టాప్ క్వాలిటీ బొగ్గు ఇవ్వాలి. కానీ బొగ్గు నిల్వలు లేక వారం రోజులుగా పవర్ జనరేషన్ స్టేషన్లు బంద్ అవుతున్నాయి. సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52 వేల కోట్లు బాకీ ఉంది.. అందుకే థర్డ్ గ్రేడ్ బొగ్గు సరఫరా చేస్తున్నారు.. నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు. ఈ నాసిరకం బొగ్గు వల్ల పవర్ స్టేషన్లు షట్‌డౌన్ అయ్యాయని కేటీఆర్ తెలిపారు.
సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట జరిగిన కుంభకోణాలు ముందే చెప్పాం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం. దొంగకే తాళం ఇచ్చినట్లు, కేంద్ర బొగ్గు శాఖా మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికే లేఖ రాశాడు.. దొంగ, చీకటి ఒకటయ్యాయి. రాష్ట్రంలో గ్రాస్ మిస్‌మేనేజ్‌మెంట్ ఆఫ్ రిసోర్సెస్, గ్రాస్ మిస్‌మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ జరుగుతుంది. బొగ్గు లేక వారం రోజుల్లో ఐదు పవర్ జనరేషన్ యూనిట్లు బంద్ అయ్యాయి. మేము కొన్ని రోజుల క్రితమే సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, రూ. 1600 కోట్ల కుంభకోణం జరిగిందని బయటపెట్టాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొగ్గు ఉందని అంటున్నడు.. బొగ్గు నిజంగానే ఉంటే కోల్ నిల్వలు నిల్ అని వార్తలు ఎందుకు వస్తున్నాయి? పవర్ జనరేషన్ యూనిట్లు ఎందుకు బంద్ అయితున్నయి? అని కేటీఆర్ నిలదీశారు.
బొగ్గు లేక 4,000 మెగావాట్ల కెపాసిటీ గల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కేవలం 400 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. భద్రాద్రిలో కూడా 270 మెగావాట్ల కెపాసిటీ గల విద్యుత్ కేంద్రాన్ని మూసేశారు. సింగరేణి వాళ్లను ఇదేంటని అడిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రూ.52,000 కోట్లు రావాలని, అందుకే డబ్బులు ఇచ్చిన వాళ్లకే ఫస్ట్ గ్రేడ్ కోల్ ఇచ్చి, జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ ఇస్తున్నామని చెప్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రేపు పవర్ స్టేషన్లకు బీఆర్ఎస్ బృందాలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లలో ఏం జరుగుతుందో నిజానిజాలు తేల్చడానికి ఆరు బీఆర్ఎస్ బృందాలు గురువారం పవర్ స్టేషన్లకు వెళ్తాయని కేటీఆర్ తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న స్పష్టమైన డిమాండ్‌తో, పంపులు ఆన్ చేసి నీళ్ళు విడుదల చేయాలన్న డిమాండ్‌తో పవర్ ప్లాంట్ల పర్యటనకు వెళ్తారని పేర్కొన్నారు.
- యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బృందం
- కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ - రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బృందం
- భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ - మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బృందం
- కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ - మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బృందం
- సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ - మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు
- సింగరేణి ప్రధాన కార్యాలయం - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..
- ●Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?
- ●Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
- ●CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
- ●Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం
- ●Nani The Paradise movie | నాని 'ది ప్యారడైజ్' ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?

Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..

Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?

Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు




