KTR Birthday | మొక్కలు నాటిన కేటీఆర్.. ఆశీర్వదించిన కేసీఆర్
KTR Birthday | తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
KTR Birthday | త్రినేత్ర.న్యూస్ : తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేటీఆర్‌ను కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.

హ్యాపీ బర్త్ డే అన్నయ్య..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా పర్యావరణ స్పృహను ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామినై ఇవాళ మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. రాబోయే తరాల కోసం ప్రకృతిని సంరక్షించాలని లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఒక గొప్ప నేతకు ఇది ఒక చిరు ప్రయత్నమని పేర్కొన్నారు. నేడు నాటిన మొక్కలు రేపు మహావృక్షాలుగా ఎదిగి, పర్యావరణ సమతుల్యతను కాపాడాలని, భూమాత పట్ల మనకున్న బాధ్యతను చాటి చెప్పాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నయ్య.. మీకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని సంతోష్ కుమార్ తెలిపారు.


Today, on the birthday of my dearest brother Sri @KTRBRS garu, I had the privilege of planting saplings as part of the #GreenIndiaChallenge, a people’s movement that has transformed environmental consciousness into a mass mission.
This small gesture is a tribute to a visionary… pic.twitter.com/H86cc4XcRZ
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 24, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు






