త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అణిచివేసేందుకే.. హేట్ స్పీచ్ బిల్లు : కేటీఆర్‌

KTR | ప్ర‌జ‌ల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసేందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు 2026 ను తీసుకువ‌స్తోంద‌ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Mar 30, 2026, 5.56 pm IST

KTR | భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అణిచివేసేందుకే.. హేట్ స్పీచ్ బిల్లు : కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జ‌ల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసేందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు 2026 ను తీసుకువ‌స్తోంద‌ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మండిప‌డ్డారు.

నిజమైన విద్వేష ప్రసంగాలను నివారించడం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన బాధ్యత అయినప్పటికీ, ప్రస్తుత బిల్లు దాని దుర్వినియోగానికి వీలుక‌ల్పిస్తుంద‌ని మండిప‌డ్డారు. ప్రజాశాంతిని కాపాడ‌కుండా, ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు, పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అసమ్మతి వ్యక్తం చేసే సాధారణ పౌరులే ల‌క్ష్యంగా బిల్లును రూపొందించార‌ని దుయ్య‌బ‌ట్టారు. మన దేశంలో విద్వేష ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం, పరువు నష్టం, ప్రజా అశాంతికి సంబంధించిన అనేక చట్టపరమైన నిబంధనలు ఇప్పటికే ఉన్నాయ‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టికే ఉన్న చ‌ట్టాల అమ‌లును బ‌లోపేతం చేయ‌కుండా, ఎలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు రూపొందించ‌కుండా, కార్యనిర్వాహక అధికార పరిధిని విస్తరించే ఒక సమాంతర చట్రాన్ని ప్రవేశపెడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠోరమైన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

హేట్ స్పీచ్‌పై చ‌ట్టాలున్న‌య్‌..

7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భ‌యాందోళ‌న‌లు సృష్ట‌స్తున్నార‌ని ఆగ్రహించారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై చట్టాలున్నాయ‌ని.. ఇంకా ఈ చట్టం తీసుకురావడం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. దీని వెన‌క ఉద్దేశం ఏంట‌ని ఆయ‌న నిలదీశారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాల‌ని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం..

‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు తెలిపిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement