త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..!

KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్( Formula E Car Race ) కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) నాంప‌ల్లిలోని ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో త‌న‌ను ఏ1గా పేర్కొన‌డాన్ని కేటీఆర్ స‌వాల్ చేశారు.

S

Telangana | Published On Oct 12, 2026, 5.34 pm IST

KTR | నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..!
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్( Formula E Car Race ) కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) నాంప‌ల్లిలోని ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో త‌న‌ను ఏ1గా పేర్కొన‌డాన్ని కేటీఆర్ స‌వాల్ చేశారు. చార్జిషీట్లో తన పేరును తొలగించాలంటూ కోర్టును అభ్య‌ర్థించారు.

ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తన పేరును ఈ జాబితాలో చేర్చారంటూ కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల జాబితా నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోర్టును కోరారు. కేటీఆర్ తరపున దాఖలైన ఈ డిశ్చార్జ్ పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి ఏసీబీ కోర్టు, దీనిపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement