KTR | ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ తోడు దొంగలే.. నిందితుడిని కాపాడిన వెధవ ఎవరు..? : కేటీఆర్
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మైనర్ మీద అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని 9 రోజుల పాటు రక్షించారు.. చివరకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులకు అప్పజెప్పారు అని కేటీఆర్ తెలిపారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మైనర్ మీద అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని 9 రోజుల పాటు రక్షించారు.. చివరకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులకు అప్పజెప్పారు అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. మీడియా కూడా కళ్లు, చెవులు, ముక్కు మూసుకున్నారు. నాలుగు రోజులు.. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు.. సిగ్గుపడాలి. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియాకు సోయి కూడా లేదు.. ఇంత సీరియస్ ఇష్యూ మీద అని కేటీఆర్ మండిపడ్డారు.
నిందితుడిని కాపాడిన వెధవ ఎవరు..?
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ తోడు దొంగలే. ఈ రాష్ట్రంలో ఒక మైనర్ మీద అఘాయిత్యం జరిగితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండీ.. ఈ రాష్ట్ర హోం మంత్రి.. ముఖ్యమంత్రి కాదా..? ఆ అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను ఆరు గంటలు పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టి వేధించి చివరకు కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారు ఈ కేసు. వాస్తవం ఏంటి..? బాలికపై జరిగిన అఘాయిత్యానికి న్యాయం చేయమని బోరున ఏడిస్తే.. నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచ మర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవరు..? ఇద్దరిలో ఆ వెధవ ఎవరు..? తెల్వదా ప్రజలకు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
డీజీపీవి తలకాయ లేని మాటలు..
ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో ఉన్నాం.. అందుకే కేసు పెట్టలేదని డీజీపీ తలకాయ లేని మాటలు మాట్లాడిండు. ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు ఉన్నప్పుడల్లా నేరస్తులందరికీ హాలీడే ఇస్తారా..? మూడు రోజులు చంపుకోండ్రా బై అని చెప్తరా..? రేవంత్ రెడ్డి గారి చంచల్‌గూడ బ్యాచ్‌మెట్స్‌కు చెలరేగమని చెప్తారా..? ఏం చెప్తున్నారు.. సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వానికి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రేవంత్‌కు చిన్న మెదడు చిట్లిపోయిందా..?
సెన్సిటివ్ విషయమని చెప్పి మేం 10 రోజులు మౌనంగా ఉన్నాం. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో ఇవాళ నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాను. అసలు మెదడు ఉందా ఆయనకు. వడదెబ్బకు ఏమన్న చిన్న మెదడు చిట్లిపోయిందా..? ఏం మాట్లాడుతున్నాడు ఆయన నాకు అర్థం కావడం లేదన్నారు కేటీఆర్.
చిల్లర రాజకీయం మంచిది కాదు..
మా బామ్మర్ది ఇంట్లో ఏమో దొరికినయ్ అంటడు. కేసు పెట్టు ఎవడు వద్దన్నడు నిన్ను. ఏం దొరకలేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పిండు కదా.. నువ్వేదో ఇరికియ్యమని చెప్పినట్టు ఉన్నావ్. ఇరికియ్యలేకపోయారు నేనేం చేస్తా దానికి. ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు అని సీఎంను కేటీఆర్ హెచ్చరించారు.
ఇదంతా ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజ్‌మెంట్ కాదా..?
9 రోజులు ఒక పోక్సో నిందితుడిని ఈ దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టారా..? మీ ఇద్దరికి ఎందుకంత అండర్ స్టాండింగ్. నిందితుడిని నిందితుడిగా చూడాలి.. ఎవరైతే ఏంది..? ఎందుకంత భయం. ఎందుకు కాపాడినవ్ అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. చివరకు కేసు రిజిస్టర్ చేయడానికి భయం. మీడియాలో రాయడానికి భయం. ఈ మేనేజ్‌మెంట్ అంతా ఎవడు చేస్తున్నడు. నువ్వు నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా..? వాస్తవం కాదా.. మీడియాకు ఫోన్లు చేసి బతిమిలాడింది నిజం కాదా..? రాయకండి దండం పెడుతా అని. మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా..? అని కేటీఆర్ నిలదీశారు.
కేంద్ర మంత్రి కొడుకైతే ముట్టుకోవద్దా..?
9 రోజులు నిందితుడిని దాచిపెడితే.. ఒక సామాన్యుడు అయితే పోలీసులు ఊరుకుంటారా..? వాళ్ల తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీసు స్టేషన్‌లో కూర్చోపెట్టరు. ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్స్‌పెక్షనా..? నువ్ రేప్ చేయ్.. మర్డర్ చేయ్.. ఏమన్న చేయ్.. కేంద్ర మంత్రి కొడుకైతే మేం ముట్టుకోం.. రేవంత్ రెడ్డి మాదోస్తు కాపాడుతాడని కలలు కన్నారు. చివరికి దిక్కులేక సరెండర్ చేశారని కేటీఆర్ తెలిపారు.
హైకోర్టుకు సెల్యూట్ చేస్తున్నా..
హైకోర్టుకు సెల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. రాకపోతే చచ్చినట్టు సరెండర్ చేశారు. నువ్వు అరెస్టు అంటవ్.. ఆయన లొంగుబాటు అంటడు. ఇద్దరు డ్రామాలు. తోడు దొంగలు.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నరు. ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలు నీ మొహం మీద ఉమ్ముతున్నరు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్న.. బుర్ర కూడా తక్కువనే అని కేటీఆర్ విమర్శించారు.
ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టింది ఎవరు..?
ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన వెధవలు ఎవరో బయటపెట్టండి. పేట్ బషీరాబాద్‌లో 15 మంది మీద కేసు అయింది.. ఆ వెధవలు ఎవరు.. బీజేపోళ్లు. ఆ అమ్మాయి హానీట్రాప్ అని మీడయాలో రాసిన వెధవలు ఎవరు..? హానీట్రాప్ అని మనీట్రాప్‌లో పడ్డ మీడియా ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎవడైతే ఏందీ.. పోక్సో కేసులో లోపలేయాలి..
మీకు సిగ్గుందా.. ఇజ్జత్ ఉందా.. బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినవ్.. సిగ్గుంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ మీదికెళ్లి సుద్దపూసల్లాగా యాక్టింగ్‌లు.. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి నువ్వు.. ఏం మాట్లాడుతున్నవ్. సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేసిన అంటున్నడు.. ఎవడైతే ఏందీ.. పోక్సో కేసులో లోపలేయాలి. మిగతా వాళ్లకు ఇదే ట్రీట్‌మెంట్ ఉందా..? పోక్సో కేసులో క్రిమినల్స్ అందరికీ 25 ఏండ్ల జైలు శిక్ష పడుతుంది అని కేటీఆర్ తెలిపారు.
ఏమైనా మోదీ చెవిలో చెప్పిండా..?
ఇవాళ ఇక్కడెందుకు భయపడుతున్నవ్.. స్పెషల్ ట్రీట్‌మెంట్ ఎందుకు..? మోదీ చెప్పిండా చెవిలో ఏమైనా.. ఎందుకు భయపడుతున్నవ్. ఇంకా సిగ్గులేకుండా పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒక్కటే అడుగుతున్నా.. ఆ నిందితుడిని 9 రోజులు కాపాడిన ఆ వెధవ ఎవరు..? నువ్వా..? కేంద్ర మంత్రినా..? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు.. రేవంత్ రెడ్డి రాగానే పోలీసోళ్లు అంత పనికిమాలినోళ్లు అయిపోయారా..? కరీంనగర్‌లో తుపాకులు పట్టుకుని కాల్చితే వాళ్లను పట్టుకునేందుకు 15 రోజులు పడుతది. ఎంత దారుణం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. ఇలా వ్యవహరిస్తే ఎవరైనా బాధిత అమ్మాయిలు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారా..? అవతలోడు పలుకుబడి ఉన్నోడు అయితే వాన్ని పట్టుకోలేం. ప్రభుత్వాలు కలిసిపోతాయని అనుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అభినందనలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా. అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. మీడియాను అప్రమత్తం చేస్తూ ఆ బాలికకు న్యాయం జరగాలని మా పార్టీ తరపున పోరాడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనను పట్టుకొని ఆయన జడ్జినా అంటున్నరు. భవిష్యత్‌లో తప్పకుండా ఆయన నీకు పాఠాలు చెప్పే రోజు వస్తది అని కేటీఆర్ అన్నారు.
నిన్ను పట్టుకున్నది పోలీసులే.. మరిచిపోకు రేవంత్
రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది.. రేవంత్ రెడ్డి పోలీసు అధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎలా పట్టుకోవాలో చెబుతున్నాడట. నిన్ను పట్టుకున్నది వాళ్లే.. అది మరిచిపోకు. దొంగలను ఎట్ల పట్టుకోవాలో పోలీసోళ్లకు బాగా తెలుసు. అక్కడున్న వారంతా కామెడీ నవ్వుకుని ఉండొచ్చు.. దొరికిన దొంగ వీడు.. వీడు కూడా మాకు చెప్పేటోడు అయిండని. కాబట్టి ఈ వెటకారాలు, డ్రామాలు ఆపేసి ధాన్యం కొనుగోళ్ల మీద దృష్టి పెట్టు అని కేటీఆర్ సూచించారు.
రోహిత్ రెడ్డిని ఎప్పుడో సస్పెండ్ చేశాం..
ఆయనకు ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ రాలేదు ఆయనకు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద ఏదో దుమ్మెత్తి పోయడం అలవాటుగా ఉంది. డ్రగ్స్ టెస్టులు పెట్టండి అంటే ఎందుకు వెనక్కిపోయాడు. మీ ఎంపీలకు పెట్టు.. చిన్న స్కూల్ పొరగాడిలా మాట్లాడుతున్నాడు.. అప్పుడప్పుడు ముఖ్యమంత్రిలాగా హుందాగా మాట్లాడు. రోహిత్ రెడ్డిని ఎప్పుడో సస్పెండ్ చేశాం. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రికి తెల్వకపోతే నేనేం చేస్తా అని కేటీఆర్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం : హరీశ్‌రావు
మే 22, 2026

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
మే 22, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?
- ●Alleti Maheshwar Reddy | కొన్నది 24 శాతమే.. 80 శాతం ఎక్కడ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్న
- ●Hottest Cities | నిప్పుల కొలిమిలా భారత్.. టాప్-50 అత్యంత వేడి నగరాలు దేశంలోనే..!
- ●realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Oven | ఓవెన్ వాడకంలో ఈ 5 తప్పులు చేస్తే వంటలు పాడవుతాయి.. ఈ సూచనలు పాటించండి..
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..

Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?

Alleti Maheshwar Reddy | కొన్నది 24 శాతమే.. 80 శాతం ఎక్కడ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్న

Hottest Cities | నిప్పుల కొలిమిలా భారత్.. టాప్-50 అత్యంత వేడి నగరాలు దేశంలోనే..!

realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..



