Oven | ఓవెన్ వాడకంలో ఈ 5 తప్పులు చేస్తే వంటలు పాడవుతాయి.. ఈ సూచనలు పాటించండి..
Oven | ఇంట్లో ఓవెన్ ఉంటే కేకులు, కుకీస్ బేక్ చేయడం నుంచి వెజిటేబుల్స్ రోస్ట్ చేయడం, చికెన్ గ్రిల్ చేయడం వరకు ఎన్నో పనులకు ఉపయోగిస్తుంటారు. అయితే కిచెన్‌లో ఎంతో ఉపయోగకరమైన ఈ అప్లయన్స్ గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు.
Oven | ఇంట్లో ఓవెన్ ఉంటే కేకులు, కుకీస్ బేక్ చేయడం నుంచి వెజిటేబుల్స్ రోస్ట్ చేయడం, చికెన్ గ్రిల్ చేయడం వరకు ఎన్నో పనులకు ఉపయోగిస్తుంటారు. అయితే కిచెన్‌లో ఎంతో ఉపయోగకరమైన ఈ అప్లయన్స్ గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. కేకులు సమంగా బేక్ కాకపోవడం, చికెన్ డ్రై అయిపోవడం, బయటికి కుక్ అయినట్టు కనిపించి లోపల మాత్రం పచ్చిగా ఉండటం వంటి సమస్యలు చాలాసార్లు రెసిపీ వల్ల కాదు, ఓవెన్‌ను ఎలా వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఖరీదైన ఓవెన్ లేదా ప్రత్యేక ట్రైనింగ్ అవసరం లేకుండానే కొన్ని సాధారణ తప్పులను నివారించడం ద్వారా వంట ఫలితాలను భారీగా మెరుగుపరుచుకోవచ్చు. ఈ వివరాలను వంట నిపుణులు వెల్లడిస్తున్నారు. ఓవెన్ పూర్తిగా వేడెక్కకముందే ఫుడ్ పెట్టడం చాలా మంది చేసే సాధారణ తప్పు. ఇది టైమ్ సేవ్ చేస్తున్నట్టుగా అనిపించినా వంటపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బేకింగ్‌లో సరైన టెంపరేచర్ చాలా కీలకం.
ప్రీహీట్ తప్పనిసరి..
ప్రీహీట్ చేయకుండా కేకులు, బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీస్ వంటి వంటలు అసమానంగా బేక్ అవుతాయి. మధ్యలో డెన్స్‌గా ఉండిపోవచ్చు లేదా సరిగ్గా విస్తరించకపోవచ్చు. రోస్టింగ్ చేసినా సరైన బ్రౌనింగ్ రావడం ఆలస్యం అవుతుంది. అందుకే ఓవెన్ అవసరమైన టెంపరేచర్‌కి చేరేవరకు వేచి ఉండాలి. చాలామంది ప్రతి వంటకానికీ మధ్య ర్యాక్‌నే ఉపయోగిస్తారు. కానీ అన్ని వంటలకు అదే సరైన స్థానం కాదు. ఓవెన్‌లో ప్రతి ర్యాక్‌కు హీట్ తేడాగా అందుతుంది. పై ర్యాక్ దగ్గర పెట్టిన ఫుడ్ త్వరగా బ్రౌన్ అవ్వచ్చు లేదా కాలిపోవచ్చు. కింద ర్యాక్‌లో పెట్టినవి నెమ్మదిగా కుక్ అవుతాయి. కుకీస్, కేకులు సాధారణంగా మధ్య ర్యాక్‌లో బాగా బేక్ అవుతాయి. వెజిటేబుల్స్ రోస్ట్ చేయాలంటే కొంచెం పై ర్యాక్ ఉపయోగిస్తే మంచి కరామలైజేషన్ వస్తుంది. ఒకేసారి ఎక్కువ వంటలు చేయాలనే ఉద్దేశంతో ట్రేలను గట్టిగా పెట్టడం మరో పెద్ద తప్పు. ఓవెన్‌లో వేడి గాలి స్వేచ్ఛగా తిరగాలి. అప్పుడు మాత్రమే ఫుడ్ సమంగా కుక్ అవుతుంది.
పదే పదే డోర్ తెరవద్దు..
ట్రేలు దగ్గరగా పెట్టినప్పుడు హీట్ సరిగ్గా సర్క్యులేట్ కాదు. దీంతో కొన్ని భాగాలు ఎక్కువగా కుక్ అవుతాయి, మరికొన్ని పచ్చిగా మిగిలిపోతాయి. బ్యాచ్‌లుగా వండటం కొంత సమయం తీసుకున్నా ఫలితం మాత్రం మెరుగ్గా ఉంటుంది. వంట ఎలా ఉందో చూడాలని పదేపదే ఓవెన్ డోర్ తెరవడం కూడా తప్పే. ప్రతిసారి డోర్ తెరిస్తే లోపలి వేడి బయటకు వెళ్లిపోతుంది. దీంతో టెంపరేచర్ మారిపోతుంది. కేకులు, సుఫ్లేలు, బ్రెడ్ వంటి బేకింగ్ ఐటమ్స్‌కు స్థిరమైన వేడి చాలా అవసరం. డోర్ తరచూ తెరిస్తే కేకులు కుంగిపోవచ్చు లేదా అసమానంగా బేక్ అవుతాయి. అందుకే వీలైనంత వరకు ఓవెన్ లైట్, గ్లాస్ విండో ద్వారా మాత్రమే చెక్ చేయడం మంచిది. ప్రతి పాత్ర ఓవెన్‌లో వాడటానికి సరిపోదు. అయినా చాలామంది చెక్ చేయకుండా సాధారణ పాత్రలను ఓవెన్‌లో పెడుతుంటారు. ఇది ప్రమాదకరమే కాకుండా వంటలను కూడా పాడుచేస్తుంది. ప్లాస్టిక్ హ్యాండిల్స్, పలుచని గ్లాస్ లేదా కొన్ని నాన్‌స్టిక్ కోటింగ్స్ అధిక ఉష్ణోగ్రతల వద్ద వంకర తిరగడం, పగలడం లేదా హానికర వాసనలు విడుదల చేయడం జరుగుతుంది. అందుకే పాత్రపై ఓవెన్-సేఫ్ లేబుల్ ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఓవెన్‌ను సరిగ్గా ఉపయోగించడం అంటే క్లిష్టమైన టెక్నిక్స్ తెలుసుకోవడం కాదు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పాటిస్తే వంట రుచి, టెక్స్చర్ మెరుగుపడటమే కాకుండా ఓవెన్ జీవితకాలం కూడా పెరుగుతుంది.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్




