Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ..!
Anganwadi Job Notification | అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Anganwadi Job Notification | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని మంత్రి సీతక్క గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రకటన కార్యరూపం దాల్చనుంది. ఎందుకంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
టీచర్ల కంటే సహాయకుల పోస్టులే అధికం..
అయితే పదోన్నతులు, పదవీ విరమణతో 2025-26 ఏడాది నాటికి ఏర్పడిన ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటూ ఖాళీలను గుర్తించారు అధికారులు. పదవీ విరమణతో కొత్తగా మరో 708 ఖాళీలు ఏర్పడటంతో ఆ సంఖ్య 15,982కి చేరింది. ఇందులో అత్యధికంగా సహాయకుల పోస్టులు 12,882 ఉంటే.. టీచర్ పోస్టులు 3,100గా ఉన్నాయి.
విద్యార్హతలు, నియామక విధానంపై త్వరలో స్పష్టత
తెలంగాణ వ్యాప్తంగా 35,781 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో 71,562 మంది టీచర్లు, సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నారు. గత మూడేళ్లుగా పదవీ విరమణ, సిబ్బందికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు, కొందరికి ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేయాల్సిన సిబ్బందికి సంబంధించి 22.33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు, నియామక విధానంపై త్వరలో శిశు సంక్షేమ శాఖ స్పష్టత ఇవ్వనుంది. కొత్త నియామక విధానానికి ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
మే 22, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?



