త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్‌ లాంచ్.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..

realme 16T | స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియ‌ల్‌మి భారత మార్కెట్‌లో కొత్త రియల్‌మి 16టి 5జి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన రియల్‌మి 15టికి దీన్ని సక్సెసర్‌గా తీసుకొచ్చారు. ఆల్-స్టార్ బ్యాటరీ, సూపర్‌స్టార్ పోర్ట్రెట్స్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫోన్ భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఏఐ కెమెరా ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

S

Technology | Published On May 22, 2026, 1.14 pm IST

realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్‌ లాంచ్.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..
Advertisement

realme 16T | స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియ‌ల్‌మి భారత మార్కెట్‌లో కొత్త రియల్‌మి 16టి 5జి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన రియల్‌మి 15టికి దీన్ని సక్సెసర్‌గా తీసుకొచ్చారు. ఆల్-స్టార్ బ్యాటరీ, సూపర్‌స్టార్ పోర్ట్రెట్స్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫోన్ భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఏఐ కెమెరా ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రియల్‌మి 16టి 5జి ఫోన్‌కి ఐపీ69 ప్రో లెవల్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఇది సాధారణ ఐపీ68 కంటే మరింత మెరుగైన రక్షణను అందిస్తుంది. హై ప్రెషర్, హై టెంపరేచర్ 80 డిగ్రీల సెల్సియస్ వాటర్ జెట్స్‌ను కూడా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఇక ఫోన్‌లో ఆర్మర్‌షెల్ 4-లేయర్ డ్రాప్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. రీఇన్‌ఫోర్స్డ్ కార్నర్స్, ఎయిర్‌బ్యాగ్ కుషనింగ్ డిజైన్, మెటాలిక్ మిడ్-ఫ్రేమ్, మెటల్ స్ట్రక్చరల్ డ్రాప్ ఫ్రేమ్ వంటి రక్షణ ఫీచర్లతో ఈ డివైస్ మిల్-ఎస్‌టిడి-810హెచ్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ టెస్టింగ్‌ను కూడా పాస్ అయింది.

అద్భుత‌మైన డిస్‌ప్లే..

రియల్‌మి 16టి 5జిలో గ్లీమింగ్ వింగ్స్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్ ప్యానెల్‌పై మల్టీ కలర్ షిమ్మరింగ్ పార్టికల్స్ ఉండటంతో లైట్ పడినప్పుడు శాండ్ గ్రేడియంట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఫోన్ భారత్‌లో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అరోరా గ్రీన్, స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ రెడ్ (భారత్‌కు ప్రత్యేక వెర్షన్) క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో దీన్ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 5300ఎంఎం స్క్వేర్ ఎయిర్‌ఫ్లో వీసీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో గేమింగ్ సమయంలో 60ఎఫ్‌పీఎస్ స్టేబుల్ పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల సన్‌లైట్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఔట్ డోర్ విజిబిలిటీ కోసం ఇందులో 1200 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ ఇచ్చారు. దీనికి డీసీ డిమ్మింగ్ ఐ కేర్ ఫీచర్ కూడా ఉంది. క‌ళ్ల‌కు హాని క‌లిగించ‌ని విధంగా ఇది ప‌నిచేస్తుంది. సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా రూపొందించారు.

ప‌వ‌ర్‌ఫుల్ ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై పనిచేస్తుంది. ఫ్లక్స్ ఇంజిన్ యానిమేషన్ ఫ్రేమ్‌వర్క్, ఏఐ బూస్ట్ 3.0, ఎక్స్‌టెండెడ్ యూజ్ కేర్ 2.0 వంటి ఫీచర్లతో దీర్ఘకాలం స్మూత్ పనితీరు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో 50ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. 2ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. లూమాకలర్ ఇమేజ్ ఇంజిన్, ఏఐ పోర్ట్రైట్ గ్లో, ఏఐ పాప్‌ఔట్ కొలాజ్, ఏఐ స్టైల్‌మీ, ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ వంటి ఏఐ ఫీచర్ల‌ను ఇచ్చారు. ప్రధాన కెమెరాతో సెల్ఫీలు తీసుకునేందుకు వెనుక భాగంలో ప్రత్యేక మిర్రర్ ను కూడా ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ..

ఇక ఇందులో ప్రధాన హైలైట్ 8000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ. రియల్‌మి నంబర్డ్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీ ఇదేన‌ని కంపెనీ చెబుతోంది. హెవీ యూజ్‌లో కూడా మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని పేర్కొంది. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 48 నిమిషాల్లో 50 శాతం వరకు చార్జ్ అవుతుంది. 5 నిమిషాల చార్జింగ్‌తో 7 శాతం బ్యాటరీ వస్తుందని తెలిపింది. బైపాస్ చార్జింగ్ ఫీచర్‌తో గేమింగ్ సమయంలో వేడి తగ్గుతుంది. అలాగే 7 ఏళ్ల పాటు వాడిన త‌రువాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. సైడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

ధ‌ర ఎంతంటే..

రియల్‌మి 16టి 5జి ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ, 128జీబీ ధ‌ర రూ.29,999 ఉండ‌గా, 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.31,999 గా ఉంది. అలాగే 8జీబీ, 256జీబీ వేరియెంట్ ధ‌రను రూ.34,999గా నిర్ణ‌యించారు. బ్యాంక్ ఆఫర్లు, యూపీఐ డిస్కౌంట్లు, బైబ్యాక్ ప్లాన్‌లతో ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ ఫోన్‌ను రియ‌ల్‌మి ఆన్ లైన్ స్టోర్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, మెయిన్‌లైన్ ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు.

Advertisement
Advertisement