త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?

Sensex | భారత స్టాక్ మార్కెట్‌ల‌పై ప్రపంచ బ్రోకరేజ్ సంస్థలు జాగ్రత్త ధోరణి అవలంబిస్తున్న సమయంలో మోర్గాన్ స్టాన్లీ మాత్రం భారత్‌పై బుల్లిష్ అభిప్రాయాన్ని కొనసాగిస్తోంది. కార్పొరేట్ లాభాల మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల షాక్ వంటి రిస్కులు ఉన్నప్పటికీ, వచ్చే 12 నెలల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 89,000 స్థాయికి చేరే అవకాశముందని సంస్థ అంచనా వేసింది.

S

Business | Published On May 22, 2026, 1.38 pm IST

Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?
Advertisement

Sensex | భారత స్టాక్ మార్కెట్‌ల‌పై ప్రపంచ బ్రోకరేజ్ సంస్థలు జాగ్రత్త ధోరణి అవలంబిస్తున్న సమయంలో మోర్గాన్ స్టాన్లీ మాత్రం భారత్‌పై బుల్లిష్ అభిప్రాయాన్ని కొనసాగిస్తోంది. కార్పొరేట్ లాభాల మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల షాక్ వంటి రిస్కులు ఉన్నప్పటికీ, వచ్చే 12 నెలల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 89,000 స్థాయికి చేరే అవకాశముందని సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ సుమారు 75,000 కు పైస్థాయిలో ట్రేడ్ అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తక్కువ స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ, జూన్ 2027 నాటికి సెన్సెక్స్‌లో మరో 15 శాతం అప్‌సైడ్ అవకాశముందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. సంస్థ ఈ అంచనాకు 50 శాతం ప్రాబబిలిటీ కేటాయించింది. మోర్గాన్ స్టాన్లీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధ‌మ్ దేశాయ్ తెలిపిన ప్రకారం సెన్సెక్స్ 89,000 స్థాయికి చేరితే ట్రైలింగ్ పీఈ మల్టిపుల్ 23.5ఎక్స్‌కు చేరుతుంది. ఇది గత 25 ఏళ్ల సగటు 22ఎక్స్ కంటే ఎక్కువ. భారత్‌లో మధ్యకాలిక వృద్ధిపై నమ్మకం, స్థిరమైన పాలసీ వాతావరణం, తక్కువ బీటా, మెరుగైన గ్రోత్ అవకాశాలు దీనికి కారణమని తెలిపారు.

భారీగా పెర‌గ‌నున్న కార్పొరేట్ ఆదాయం..?

భారత్‌ను డిఫెన్సివ్ గ్రోత్ మార్కెట్ గా పేర్కొన్న మోర్గాన్ స్టాన్లీ, గత ఆరు క్వార్టర్లుగా కొనసాగుతున్న మధ్యస్థాయి మందగమనానికి ముగింపు పలికి, ఇక నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ వేగంగా పెరుగుతాయని భావిస్తోంది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఆర్‌బీఐ వడ్డీ రేటు కోతలు, బ్యాంకింగ్ రంగంలో డీ రెగ్యులేషన్, లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్, ఎనర్జీ, డిఫెన్స్, సెమీకండక్టర్స్, ఫర్టిలైజర్స్, డేటా సెంటర్లలో భారీ క్యాపెక్స్ పెట్టుబడులను పేర్కొంది. అలాగే భారీ పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకర ఫిస్కల్ పాలసీలు కూడా మార్కెట్‌కు బలాన్నిస్తాయని అంచనా వేసింది. దేశీయ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగడం, గ్లోబల్ గ్రోత్ స్థిరంగా ఉండటం, ప్రస్తుత స్థాయిల నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ల‌కు మద్దతు ఇస్తాయని తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం గత 12 నెలల రిలేటివ్ పనితీరు చరిత్రలోనే బలహీన స్థాయికి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల పొజిషనింగ్ కూడా మల్టీ ఇయర్ క‌నిష్టాల వద్ద ఉంది. అయినప్పటికీ గ్లోబల్ ఇండెక్స్ వెయిటేజ్‌తో పోలిస్తే ప్రపంచ కార్పొరేట్ లాభాల్లో భారత్ వాటా 2009 తర్వాత అత్యధిక స్థాయిలో ఉందని సంస్థ గుర్తించింది.

ప్ర‌పంచ జీడీపీ వృద్ధిలో భార‌త్ వాటా పెరిగే చాన్స్‌..

భారత స్టాక్ మార్కెట్‌ల‌కు ప్రత్యక్ష ఏఐ ప్లే లేకపోవడం ప్రధాన సవాలుగా మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ముఖ్యంగా ఇండియన్ ఐటీ సర్వీసెస్ ఎగుమతులపై ఏఐ ప్రభావం ఉండొచ్చని హెచ్చరించింది. అయినప్పటికీ మల్టీ పోలార్ ప్రపంచ వ్యవస్థలో భారత్ పెద్ద లబ్ధిదారుగా మారుతుందని అంచనా వేసింది. తదుపరి దశాబ్దంలో దేశ జీడీపీలో మాన్యుఫ్యాక్చరింగ్ వాటా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, విస్తరిస్తున్న వినియోగదారుల వర్గం భారత్‌కు ప్రధాన బలం అని వివరించింది. 2025లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్ వాటా 18 శాతంగా ఉండగా, రాబోయే సంవత్సరాల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తక్కువ స్థాయి నుంచి ప్రారంభమైన లేబర్ ప్రొడక్టివిటీ కారణంగా ఏఐ ఆధారిత ఉత్పాదకత పెరుగుదల నుంచి భారత్ ఎక్కువగా లాభపడుతుందని అభిప్రాయపడింది. సెక్టార్ పరంగా చూస్తే, డిఫెన్సివ్, ఎక్స్‌టర్నల్ ఫేసింగ్ రంగాల కంటే డొమెస్టిక్ సైక్లికల్స్‌పై మోర్గాన్ స్టాన్లీ ఎక్కువగా బెట్ వేస్తోంది. భారత్‌కు ప్రధాన రిస్కులు జియోపాలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ గ్రోత్ మందగమనం వంటి బాహ్య అంశాలేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డిస్క్రెషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాల్లో విలువ కనిపిస్తోందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచం ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్ నిర్మాణం కోసం భారత ఐటీ కంపెనీలవైపు మళ్లితే, ఐటీ సర్వీసెస్ డార్క్ హార్స్ గా నిలవొచ్చని పేర్కొంది. మరోవైపు ఎనర్జీ, మెటీరియల్స్, యుటిలిటీస్, హెల్త్‌కేర్ రంగాలపై అండర్‌వెయిట్ అభిప్రాయాన్ని కొనసాగిస్తోంది.

సెన్సెక్స్ 1 ల‌క్ష స్థాయిని తాకొచ్చు..

బుల్ కేస్‌లో సెన్సెక్స్ 1 లక్ష స్థాయిని కూడా తాకొచ్చని రిధమ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే దిగువకు రావడం, రీఫ్లేషన్ పాలసీలు విజయవంతం కావడం, ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం జరుగుతాయని చెప్పారు. 2026 నుంచి 2029 మధ్య కార్పొరేట్ ఎర్నింగ్స్ వార్షికంగా 19 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేశారు. అయితే బేర్ కేస్‌లో సెన్సెక్స్ 66,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎక్కువ కాలం అధిక స్థాయిలోనే కొనసాగుతున్న క్రూడ్ ధరలు, హాకిష్ సెంట్రల్ బ్యాంక్ విధానాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారీ మందగమనం ఇందుకు కారణాలవుతాయని తెలిపారు.

Advertisement
Advertisement