త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తాం : హ‌రీశ్‌రావు

Harish Rao | బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఫార్మా సిటీ భూముల‌పై రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం డ్రామా చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 22, 2026, 10.58 am IST

Harish Rao | బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తాం : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఫార్మా సిటీ భూముల‌పై రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం డ్రామా చేస్తోంద‌ని మండిప‌డ్డారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హ‌రీశ్‌రావు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హైకోర్టులో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేం ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే.. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోంది. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్... హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 శాతం మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం.. కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు అని హ‌రీశ్‌రావు చెప్పారు.

కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ 100 శాతం ర‌ద్దు చేస్తాం. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వ‌స్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేం ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్‌కు మంచి పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు.. నిలబడదు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement