Pilot Rohith Reddy | పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు..
Pilot Rohith Reddy | మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohith Reddy) బీఆర్ఎస్ (BRS) పార్టీ షోకాజు నోటీసులు (Show Cause Notice) జారీచేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.
Pilot Rohith Reddy | త్రినేత్ర.న్యూస్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohith Reddy) బీఆర్ఎస్ (BRS) పార్టీ షోకాజు నోటీసులు (Show Cause Notice) జారీచేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. గడువు సమయంలో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేశ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. అధిష్ఠానం తుది నిర్ణయం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో గత శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఈగల్ టీమ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు చేరింది. ఈ సందర్భంగా పోలీసులపై డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అనంతరం జరిగిపిన పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కోకైన్, ఇతర మత్తు పదార్థాలతోపాటు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డితోపాటు అతని సోదరుడు రితీశ్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్ యాదవ్, మొరగనేని రమేశ్, వీ.శ్రావణ్ కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, నీవిత్ శర్మ సహా ఓ మహిళను అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



