త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS NRI South Africa | జగిత్యాల జన గర్జన – విజయవంతం చేయండి! గుర్రాల నాగ‌రాజు పిలుపు

BRS NRI South Africa | ఈ నెల 20వ తేదీన జగిత్యాల గడ్డపై జరగబోయే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ “జగిత్యాల జన గర్జన”ను విజ‌య‌వంతం చేసేందుకు భారీ ఎత్తున త‌ర‌లి రావాల‌ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ (సౌత్ ఆఫ్రికా) గుర్రాల నాగ‌రాజు పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Apr 15, 2026, 7.00 pm IST

BRS NRI South Africa | జగిత్యాల జన గర్జన – విజయవంతం చేయండి! గుర్రాల నాగ‌రాజు పిలుపు
Advertisement

BRS NRI South Africa | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 20వ తేదీన జగిత్యాల గడ్డపై జరగబోయే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ “జగిత్యాల జన గర్జన”ను విజ‌య‌వంతం చేసేందుకు భారీ ఎత్తున త‌ర‌లి రావాల‌ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ (సౌత్ ఆఫ్రికా) గుర్రాల నాగ‌రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ గర్వకారణమైన నాయకుడు కేసీఆర్ సమక్షంలో ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించబడనుంద‌ని తెలిపారు.

ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ అనుచరులు, వేలాది మంది కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక కీలక ఘట్టం. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపే పరిణామం. మొన్న కేటీఆర్ జగిత్యాలకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఆశయాలకు, రామన్న ఆలోచనలకు న్యాయం జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే.. అప్పుడు మాత్రమే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది అని నాగ‌రాజు పేర్కొన్నారు.

“రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతో జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం చుడుదాం. ప్రజల ఆశలు, అభిలాషలు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ మహాసభను విజయవంతం చేయండి అని జ‌గిత్యాల వాసి గుర్రాల నాగ‌రాజు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement