Legislative Council | మండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్..
Legislative Council | త్రినేత్ర.న్యూస్: శాసన మండలి (Legislative Council) సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
Legislative Council | త్రినేత్ర.న్యూస్: శాసన మండలి (Legislative Council) సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోవాలని, అవినీతి మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని పెద్దపెట్టున నిరసన తెలిపారు. పట్టుబట్టారు. దీంతో మండలిలో గందరగోళం నెలకొన్నది. నిరసనల మధ్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తల్లిదండ్రుల పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లును సభ ఆమోదించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అలాగే నిరసన కొనసాగిస్తుండటంతో చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వారిని సభ నుంచి సస్పెండ్ (Suspension) చేశారు. గౌర సభ్యులను గౌరవ ప్రదంగా బయటకు పంపాలని మార్షల్స్‌ను ఆదేశించారు.
కాగా, అంతకుముందు గన్‌పార్క్ వద్ద కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే విషయమై గత రెండు రోజులు శాసన సభ అట్టుడికిన విషయం తెలిసిందే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీపై చర్యలు తీసుకోవాలని, హౌస్ కమిటీ వేయాలని, మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీంతో ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారం వరకు రాష్ట్రంలో జరిగిన గనుల వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. దీనికి అందీకరించని బీఆర్ఎస్, హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టింది. దీంతో ఆదివారం సమావేశాలు కొనసాగినన్ని రోజులు వారిపై స్పీకర్ సస్పెండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



