త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Pochampally | అటు ఇటు కానీ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి : ఎమ్మెల్సీ పోచంప‌ల్లి

MLC Pochampally | ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రి అటు ఇటు కానీ ఎమ్మెల్యే అని ఆయ‌న విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jul 22, 2026, 3.06 pm IST

MLC Pochampally | అటు ఇటు కానీ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి : ఎమ్మెల్సీ పోచంప‌ల్లి
Advertisement

MLC Pochampally | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రి అటు ఇటు కానీ ఎమ్మెల్యే అని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ క‌విత‌తో క‌లిసి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా కరువు పరిస్థితులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ సమీక్ష చేశారు. కానీ ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌లేదు. పొంగులేటి కమీషన్ రెడ్డిగా మారారు. దేవాదుల పంపులు ఆన్ చేయమంటే మాపైన ఆరోపణలు చేస్తున్నారు. మేడారంలో రివ్యూ పెట్టి దేవాదుల కింద ఉన్న రిజర్వాయర్లను నిపుతాం అని అన్నారు. ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని పోచంప‌ల్లి ధ్వ‌జ‌మెత్తారు.

మహిళా మంత్రులపై పొంగులేటి కక్ష కట్టారా..?

ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షకు ఇద్దరు మంత్రులు హాజరు కాలేదు. గిరిజన మంత్రి, బీసీ మంత్రి అని ఇద్దరు మహిళా మంత్రులపై పొంగులేటి కక్ష కట్టారా..? ఉమ్మడి వరంగల్ జిల్లా ఇద్దరు మహిళా మంత్రులు రాజీనామా చేయాలి. ఇంచార్జి మంత్రి పొంగులేటితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టింది. క‌డియం శ్రీహ‌రి అటు ఇటు కాని ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ వ‌ర్కులు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు ఒకరంటే ఒకరికి పడదు అని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement