MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి తనపై చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గత నెల 8వ తేదీన పోలీస్ స్టేషన్లో తనను తిట్టినట్లు, బెదిరించినట్లు సుజనా రెడ్డి చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.
సుజనా రెడ్డి ఆరోపణలు అవాస్తవం
ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
స్పష్టం చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
MLA Palla Rajeshwar Reddy | త్రినేత్ర న్యూస్ : జేఎన్టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి తనపై చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గత నెల 8వ తేదీన పోలీస్ స్టేషన్లో తనను తిట్టినట్లు, బెదిరించినట్లు సుజనా రెడ్డి చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
తాను జేఎన్టీయూ వీసీకి ఫోన్ చేసినప్పుడు, వీసీ బాత్రూమ్లో ఉన్నారని ఎవరో ఫోన్ ఎత్తి చెప్పారని తెలిపారు. ఏదైనా విషయం ఉంటే చెప్పాలని వారు అనడంతో, తాను వీసీతోనే మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశానని వెల్లడించారు. ఆ తర్వాత వీసీతో మాట్లాడానని, సీనియర్ ప్రొఫెసర్లను, ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లను దూషించడానికి కారణాలేమిటని ప్రశ్నించానని తెలిపారు.
తనపై ఏదైనా కోపం ఉంటే తనను ప్రశ్నించవచ్చని, అంతేకానీ మహిళా ప్రొఫెసర్లను ఎందుకు దూషించారని వీసీని అడిగినట్లు తెలిపారు. దీనికి వీసీ తప్పు జరిగిందని అంగీకరిస్తూ క్షమాపణ కోరారని, తాను తిరుపతి నుంచి తిరిగి వచ్చిన తర్వాత లేఖ ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ లేఖ రాకపోవడంతో మహిళా ప్రొఫెసర్లు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు సరిగా అందించకుండా, తన భార్యతో తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. మహిళా ప్రొఫెసర్లతో వీసీ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సంబంధిత సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
- ●Palamuru Lift Irrigation | పాలమూరు ఎత్తిపోతల.. బాహుబలి మోటార్లు ప్రారంభం
- ●Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?
- ●Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి
- ●Soma Bharat Kumar | హరీశ్‌రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు

Palamuru Lift Irrigation | పాలమూరు ఎత్తిపోతల.. బాహుబలి మోటార్లు ప్రారంభం

Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు

Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..

Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?



