Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy | కేసీఆర్ నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు.. ఈ సీఎం రిబ్బన్ కటింగ్ సీఎంగానే మిగిలిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర న్యూస్ : కేసీఆర్ నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు.. ఈ సీఎం రిబ్బన్ కటింగ్ సీఎంగానే మిగిలిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఏం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అన్నారు. ఈ రోజు కేసీఆర్ నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. నేను కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో రెండేళ్లలో కేసీఆర్ జెండా ఎగురుతుంది. మీరు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను గాంధీభవన్‌కు పంపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎంగా మిగిలిపోతారు. కలెక్టరేట్ నిర్మాణంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏముంది..? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి ఆయన నిర్మించిన కలెక్టరేట్‌కే వస్తున్నారు అని కౌశిక్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్ల సభకు జనం దొరకడం లేదు. అన్ని జిలల్లా నుండి ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ 10 ఏళ్లు మంత్రిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి మీరు సీఎంగా ఉన్నారు కదా..! కేటీఆర్ చేసిన అభివృద్ధిలో 10 శాతం కొండంగల్‌లో చేయండి చాలు. ఈ రోజు కొడంగల్‌లో పవర్ కట్ అవుతుందని ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. కనీసం కొడంగల్ నియోజకవర్గనికైనా పవర్ ఇవ్వండి రేవంత్ రెడ్డి. కొడంగల్ నుండి ప్రజలు తెలంగాణ భవన్‌కు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కలెక్టరేట్‌లు, సెక్రటేరియట్, హాస్పిటల్స్, ఇలా ప్రతిది కేసీఆర్ కట్టినవే. హుజురాబాద్ నియోజకవర్గానికి రెండో విడుత దళిత బంధు నిధులు విడుదల చేయాలి. నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం వేయి కోట్లు ఇవ్వాలి అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భట్టి
సెప్టెంబర్ 30, 2026

Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
సెప్టెంబర్ 30, 2026

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●MRPL oil refinery | మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు
- ●HBL Engineering | భారీగా రాబడి ఇచ్చిన షేర్.. రూ.1 లక్ష పెడితే రూ.53 లక్షలు వచ్చాయి..
- ●Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
- ●Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
- ●MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..

MRPL oil refinery | మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు

HBL Engineering | భారీగా రాబడి ఇచ్చిన షేర్.. రూ.1 లక్ష పెడితే రూ.53 లక్షలు వచ్చాయి..

Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు



