KTR | తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? : కేటీఆర్
KTR | తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదా..? మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో పోటీ చేయలేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదా..? మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో పోటీ చేయలేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఇక ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు. ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదు అని కేటీఆర్ తెలిపారు.
త్యాగాలు కూడా తెలుసుకోవాలి.. అభిమానం ఉండాలి..
కానీ, ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారియొక్క మనోభావాలు, వారియొక్క పోరాటాలు, వారియొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలి అని కేటీఆర్ అన్నారు.
2023లో పోటీ చేయలేదా మీరు?
పవన్ కళ్యాణ్ జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది? 2023లో పోటీ చేయలేదా మీరు? చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డుల్లో, కొత్తగా చేసేదేముంది? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు వచ్చారు, పోటీ చేశారు. 2023లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవడొద్దంటున్నాడు? కానీ, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు, ఇదేదో ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.
ప్రజలు అడ్డుకుంటే మేం చేస్తాం దానికి?
జనసేనను ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకుని, ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ఇప్పుడెవరు అడ్డుకున్నారు? ప్రజలు అడ్డుకుంటే మేం చేస్తాం దానికి? అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేదని సీదా చెప్పక..
పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి, ఇక్కడ మేము సభ పెడతాం, అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు... ఒకాయన అంటాడు…తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. ఇంకొకాయనేమో విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు. ఇవన్నీ ఏందంటే.. నాకు తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేదని సీదా సీదా చెప్పక, ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా?
ఇది బాగాలేదు, అది బాగాలేదు అని. మరి అది బాగాలేకపోతే, ఇది బాగాలేకపోతే, 11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీటింగ్ పెడదాం అనుకున్నావ్, అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా అనాలనుకుంటే వాళ్లననాలి. కాబట్టి, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మే భీ ఆప్ బహుత్ కరే (2023లో కూడా మీరు చాలా చేశారు) అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





