Harish Rao | కేసీఆర్ జగిత్యాల సభ వేళ.. ఢిల్లీ బయల్దేరి వెళ్లిన హరీశ్ రావు
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత (BRS Party) హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనున్నవేళ ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత (BRS Party) హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనున్నవేళ ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకే హరీశ్ రావు ఢిల్లీ వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు హరీశ్ రావు సిద్ధమయ్యారట. అందుకే లాయర్లతో భేటీ నేపథ్యంలో హస్తినకు వెళ్లినట్లుగా తెలిసింది.
పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ నేతలు తెలిపారు. హరీశ్ రావుతోపాటూ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అయితే, నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సభ ఉండగా హరీశ్ రావు ఢిల్లీ వెళ్లడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Also Read..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
దళపతి విజయ్ విడాకుల కేసు వాయిదా - భర్త ఆస్తిలో సగం భరణంగా కావాలన్న సంగీత?
ఈసారి అక్షయ తృతీయకు తగ్గిన బంగారం కొనుగోళ్లు.. పెట్టుబడిదారుల నిరాసక్తత..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



