త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | ఈసారి అక్ష‌య తృతీయ‌కు త‌గ్గిన బంగారం కొనుగోళ్లు.. పెట్టుబ‌డిదారుల నిరాస‌క్త‌త‌..

Gold | ప్ర‌తి ఏటా సాధార‌ణంగా దేశంలో అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారాన్ని ప్ర‌జ‌లు భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున బంగారం కొంటే శుభ‌ప్ర‌ద‌మ‌ని భావిస్తారు. అయితే ఈసారి మాత్రం అక్ష‌య తృతీయ (ఏప్రిల్ 19, 2026) నాడు బంగారం కొనుగోల్లు భారీగా త‌గ్గాయి. బంగారానికి డిమాండ్ బాగా త‌గ్గింది.

S

Business | Published On Apr 20, 2026, 12.33 pm IST

Gold | ఈసారి అక్ష‌య తృతీయ‌కు త‌గ్గిన బంగారం కొనుగోళ్లు.. పెట్టుబ‌డిదారుల నిరాస‌క్త‌త‌..
Advertisement

Gold | ప్ర‌తి ఏటా సాధార‌ణంగా దేశంలో అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారాన్ని ప్ర‌జ‌లు భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున బంగారం కొంటే శుభ‌ప్ర‌ద‌మ‌ని భావిస్తారు. అయితే ఈసారి మాత్రం అక్ష‌య తృతీయ (ఏప్రిల్ 19, 2026) నాడు బంగారం కొనుగోల్లు భారీగా త‌గ్గాయి. బంగారానికి డిమాండ్ బాగా త‌గ్గింది. గ‌తంలో క‌న్నా ఈసారి బంగారం ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరిగి గ‌రిష్ట స్థాయిలో ఉన్నందునే ప్ర‌జ‌లు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని చూపించ‌లేద‌ని రాయిట‌ర్స్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. అయితే గ‌తేడాదితో పోలిస్తే ఈసారి అక్ష‌య తృతీయ‌కు కొనుగోళ్లు త‌గ్గాయ‌ని, కానీ ఇత‌ర ర‌కాలుగా బంగారంపై పెట్టుబ‌డి పెట్టేందుకు పెట్టుబ‌డిదారులు ఆస‌క్తి చూపించార‌ని తేలింది. ధ‌న‌తేర‌స్ త‌రువాత అక్ష‌య తృతీయ నాడే మ‌ళ్లీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా బంగారం కొంటుంటారు. అయితే ఈసారి మాత్రం మార్కెట్ నిశ్శ‌బ్దంగా ఉంద‌ని వ్యాపారులు తెలిపారు.

అధిక ధ‌ర‌లే కార‌ణం..

పుణేకు చెందిన పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ సంస్థ సీఈవో అమిత్ మోద‌క్ మాట్లాడుతూ బంగారం ధరలు భారీగా పెరగడం నగల డిమాండ్ తగ్గింద‌ని తెలిపారు. పరిమాణ పరంగా కొనుగోళ్లు తగ్గినా, అధిక ధరల కారణంగా విలువ పరంగా ఖర్చు మాత్రం పెరిగింద‌ని తెలిపారు. జనవరి 29న బంగారం ధరలు ఔన్స్‌కు 5,594.82 డాల‌ర్ల రికార్డు స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం అవి సుమారు 4,861 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన‌ భారత్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం 10 గ్రాములకు రూ.1,54,609 వద్ద ముగిశాయి. ఇది గత అక్షయ తృతీయతో పోలిస్తే దాదాపు 63 శాతం అధికం. కొన్ని దక్షిణ భారత రాష్ట్రాలను మినహాయించి దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ స్థాయి క‌న్నా తక్కువగా డిమాండ్ నమోదైందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.

ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో పెట్ట‌బడులు..

ముంబైకు చెందిన ఒక జ్యువెలర్ తెలిపిన వివరాల ప్రకారం నగల కంటే సులభంగా క్యాష్ చేయ‌గ‌లిగే గోల్డ్ కాయిన్లవైపు రిటైల్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నార‌ని వెల్ల‌డైంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు జ్యువెలర్లు తయారీ ఛార్జీలపై డిస్కౌంట్లు కూడా అందించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం 2025లో భారత్‌లో నగల డిమాండ్ అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే 24 శాతం తగ్గగా, పెట్టుబడి డిమాండ్ 17 శాతం పెరిగి 2013 తర్వాత గరిష్ట స్థాయికి చేరింది. దేశంలో బంగారం కొనుగోలు విధానం కూడా మారుతోంది. ధరలకు సున్నితంగా స్పందించే కొనుగోలుదారులు ఇప్పుడు పండుగల సమయంలో మాత్రమే కాకుండా, ధరలు తగ్గినప్పుడు ఏడాది పొడవునా కొనుగోళ్లు చేస్తున్నారు. అలాగే రిటైల్ పెట్టుబడిదారులు డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. అయితే బంగారం ధ‌ర‌ల విష‌యంలో ప్ర‌స్తుతం ఉన్న అనిశ్చితి కార‌ణంగానే కొనుగోళ్లు త‌గ్గాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ యుద్ధం ముగిస్తే మ‌ళ్లీ ధ‌ర‌లు పెరుగుతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement