Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
Mookuthi Amman 2 | ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీస్‌లో ‘రామాయణ’ ఒకటి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Entertainment | Published On Sep 9, 2026, 12.51 pm IST
Mookuthi Amman 2 | ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీస్‌లో ‘రామాయణ’ ఒకటి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీని దీపావళి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈసారి దీపావళి బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’కు పెద్దగా కాంపిటీషన్ ఉండకపోవచ్చని ఇప్పటివరకు సినీ వర్గాలు భావించాయి. అయితే, తాజాగా ఈ లెక్కలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో ‘రామాయణ’కు గట్టి పోటీ ఇచ్చేలా మరో భారీ చిత్రం అదే టైమ్ ఫ్రేమ్‌లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
నయనతార ప్రధాన పాత్రలో..
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ దీపావళి సీజన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. డివోషనల్ టచ్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తొలి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మూకుతి అమ్మన్ 2’ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుందర్ సీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హిప్‌హాప్ తమిళా మ్యూజిక్ అందిస్తుండగా.. ఇషారి కే గణేశ్ నిర్మిస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్, క్రేజీ కాంబినేషన్‌తో రూపొందుతున్న ఈ మూవీకి తమిళనాడులో మంచి బజ్ ఉంది. ఒకవేళ ‘మూకుత్తి అమ్మన్ 2’ కూడా దీపావళి సీజన్‌లోనే థియేటర్లలోకి వస్తే.. కోలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నయనతారకు తమిళనాడులో ఉన్న క్రేజ్, ‘మూకుతి అమ్మన్’కు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ బేస్ ఈ సినిమాకు అడ్వాంటేజ్‌గా మారొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రామాయణ మూవీకి క్రేజ్..
అయితే ‘రామాయణం’పై ఉన్న హైప్ సైతం మామూలుగా లేదు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ వంటి క్రేజీ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటం, భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో నార్త్‌తో పాటు సౌత్‌లోనూ ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి రిలీజ్ కన్ఫర్మ్ అయితే.. రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘మూకుతి అమ్మన్ 2’ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో దీపావళి బరిలో ఈ రెండు సినిమాలు నిజంగానే తలపడతాయా? లేక రిలీజ్ ప్లాన్‌లో మార్పులు ఉంటాయా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా.. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తే కోలీవుడ్‌లో బాక్సాఫీస్‌పై దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!
సెప్టెంబర్ 9, 2026

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
సెప్టెంబర్ 8, 2026

Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..
- ●Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!
- ●Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు
- ●Ethiks Committee | ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారం

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం

BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..

Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!



