Ethiks Committee | ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారం
Ethiks Committee | శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి (Ethiks Committee) సిఫారసు చేశారు.
Ethiks Committee | త్రినేత్ర.న్యూస్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి (Ethiks Committee) సిఫారసు చేశారు. మంగళవారం ఇరువురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆ తీర్మానాన్ని మండలి చైర్మన్‌కి పంపారు. దానిని పరిశీలించిన గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) నేతలపై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, సభ్యుల ప్రవర్తనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా సభలో తీర్మానం చేశారు.
కాగా, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్ కుమార్ రెడ్డిని (Naveen Kumar Reddy) మండలి చైర్మన్ ఇప్పటికే సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు ఇద్దర్నీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు తొలి రోజైన సోమవారం.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై (Speaker Gaddam Prasad Kumar) ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, తమపై దురుసుగా ప్రవర్తించిన పోలీసు సిబ్బందిని అన్నట్లు తెలిపారు. అయితే తాను స్పీకర్‌ను అన్నట్లు భావిస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సెప్టెంబర్ 9, 2026

MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్‌కు లేదు..
సెప్టెంబర్ 8, 2026

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Assembly | అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
- ●Jio Black Rock AMC | జియో బ్లాక్ రాక్ నుంచి మరో కొత్త ఫండ్.. చివరి తేదీ ఎప్పుడంటే..?
- ●Vande Mataram | వందేమాతరం పూర్తి ఆరుచరణాలను ఆలపించిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేలపై మరో కేసు
- ●BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Assembly | అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్

Jio Black Rock AMC | జియో బ్లాక్ రాక్ నుంచి మరో కొత్త ఫండ్.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Vande Mataram | వందేమాతరం పూర్తి ఆరుచరణాలను ఆలపించిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..



